Wednesday, April 16, 2025

భూమికి భూధార్

- Advertisement -
- Advertisement -

ధరణి సమస్యలకు పరిష్కారంగానే భూభారతిని తెచ్చాం
నాలుగు మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు మద్దూర్
(నారాయణపేటజిల్లా), నేలకొండపల్లి (ఖమ్మం), లింగంపేట
(కామారెడ్డి), వెంకటాపూర్(ములుగుజిల్లా)లో అమలు జూన్ 2
నాటికి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తాం ప్రజల సూచనల
మేరకు ఎప్పటికప్పుడు చట్టాన్ని సవరిస్తాం ధరణిని
బంగాళాఖాతంలోనే వేస్తామని చెప్పాం..వేశాం తహశీల్దార్‌పైనే
పెట్రోల్ పోసి తగలబెట్టే పరిస్థితిని గత పాలకులు తెచ్చారు
రెవెన్యూ అధికారులను దోపిడీదారులుగా చిత్రించిన నాటి
పాలకులు దురుద్దేశంతో కల్పించిన ఇలాంటి అపోహలను
తొలగిద్దాం రెవెన్యూ సిబ్బంది, ప్రభుత్వం కలిస్తేనే ఏదైనా
సాధ్యమవుతుంది భూభారతిని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత
రెవెన్యూ అధికారులదే భూభారతి ప్రారంభోత్సవ
కార్యక్రమంలో సిఎం రేవంత్‌రెడ్డి ఇది చరిత్రాత్మక దినం :
డిప్యూటీ సిఎం భట్టి నాలుగు మండలాల్లోని
భూ సమస్యలకు 15రోజుల్లో పరిష్కారం : మంత్రి పొంగులేటి

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ ప్రాంతంలో పోరాటాలన్నీ భూమితో నే ముడిపడి ఉన్నాయని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. ‘జల్.. జంగిల్.. జమీన్’ నినాదంతో కుమురంభీమ్ పోరాడితే.. భూమి కోసం, విముక్తి కోసం దొ డ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ పోరాటం చేశారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్ర భు త్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ‘భూభారతి’ పోర్టల్‌ను సోమవారం శిల్పకళావేదికలో మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో భూభారతి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, భూగరిష్ఠ పరిమితి చట్టం తెచ్చి భూస్వాముల నుంచి మిగులు భూములను కాంగ్రెస్ ప్రభుత్వం సేకరించిందని తెలిపా రు. సేకరించిన మిగులు భూములను ఇందిరాగాంధీ ప్రభుత్వం పేదలకు పం చిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో అధ్యయనం చేసి భూ చట్టాలను చేసిందని, కానీ గత పాలకులు ఉన్నపళంగా మంచి చట్టాన్ని రద్దు చేసి ‘ధరణి’ తీసుకొచ్చారని అన్నారు. అంబేద్కర్ జయంతి రోజున భూభారతి చట్టాన్ని

69 లక్షల కుటుంబాల రైతులకు అంకితం చేస్తున్నామని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది…‘ధరణి’ని బంగాళాఖాతంలో వేస్తుందని ఆనాడే చెప్పామని, చెప్పినట్లుగా భూభారతి చట్టాన్ని తీసుకువచ్చామని చెప్పారు. రైతుల సమస్యలకు భూభారతి శాశ్వత పరిష్కారం చూపాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.ప్రతి మనిషికి ఆధార్ వలే.. ప్రతి భూమికి భూధార్ తెస్తామని సిఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ప్రతి భూమికి కచ్చితమైన సరిహద్దులతో రిజిస్ట్రేషన్ చేద్దాం అని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో వ్యవసాయ భూములను సర్వే చేసి కొలతలు వేసి హ ద్దులు గుర్తిస్తామని తెలిపారు. అనాలోచితంగా తెచ్చిన ధరణి చట్టం ఎన్నో సమస్యలకు కారణమైందని ఆరోపించారు. గత పాలకులు రెవెన్యూ చట్టాలను మార్చి తెచ్చిన ధరణి ప్రజల పాలిట భూతంగా మారిందని, తహసీల్దార్‌పైనే పెట్రోల్ పోసి తగలబెట్టే పరిస్థితి తీసుకొచ్చారని మండిపడ్డారు. రెవెన్యూ అధికారులను దోపిడీదారులుగా చిత్రీకరించి లబ్ది పొందాలని ఆనాటి పాలకులు ఆలోచన చేశారని ఆరోపించారు.

చట్టాలను చుట్టాలుగా మార్చుకుని వేలాది ఎకరాలు కొల్లగొట్టిన మాట వాస్తవం కాదా..? అని ప్రశ్నించారు. అందుకే పేదలకు మేలు చేసేందుకు నూతన ఆర్‌ఒఆర్ చట్టాన్ని తీసుకొచ్చామని వెల్లడించారు. రెవెన్యూ సిబ్బందిని గత సిఎం ఎన్నో రకాలుగా అవమానించారని, రెవెన్యూ సిబ్బంది అంటే.. ప్రజలను దోచుకునే వారిగా చిత్రీకరించారని అన్నారు. ఎలుక దూరిందని ఇల్లు తగలబెట్టే వ్యవహారం చేశారని విమర్శించారు. గ్రామాల్లో రైతుల సమస్యలను పరిష్కరించే ఉద్యోగులను తొలగించారని పేర్కొన్నారు. రెవెన్యూ సిబ్బందిని దోషులుగా చూపే విధానానికి తాను పూర్తి వ్యతిరేకం అని, వారిని ఈ ప్రభుత్వం సంపూర్ణంగా విశ్వసిస్తుందని వ్యాఖ్యానించారు. రైతుల హక్కులు కాపాడేందుకు అహర్నిశలు కృషి చేసిన వారిలో రెవెన్యూ ఉద్యోగులు కూడా ఉన్నారని తెలిపారు. రెవెన్యూ అధికారులపై దురుద్దేశంతో కొందరు కల్పించిన అపోహలను తొలగిద్దామని అన్నారు. ప్రభుత్వం, అధికారులు వేర్వేరు కాదు అని, రెవెన్యూ సిబ్బంది, ప్రభుత్వం కలిసి నడిస్తేనే ఏదైనా విజయవంతమవుతుందని వ్యాఖ్యానించారు. కలెక్టర్లు ప్రతీ మండలంలో పర్యటించాలని ఈ వేదికగా స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అందరి సహకారంతో చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని అన్నారు.

భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకే భూ భారతి
భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకే భూ భారతిని ప్రారంభించుకున్నామని సిఎం చెప్పారు. పైలట్ ప్రాజెక్టుగా నాలుగు మండలాల్లో చేపడుతున్నామని, వివాద రహిత భూ విధానాలను తీసుకురావాలని తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. ఈ చట్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత రెవెన్యూ అధికారులపైనే ఉందని, రెవెన్యూ అధికారులను ప్రజలకు చేరువ చేయాలనేదే తమ ఉద్దేశం అని స్పష్టం చేశారు. తాము అవినీతికి పాల్పడే వ్యక్తులపైన కఠినంగా ఉంటాం అని, కానీ వ్యవస్థపై కాదు అని స్పష్టం చేశారు.

భూభారతి ప్రారంభించిన రోజు చారిత్రాత్మకం : డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని రాష్ట్రంలో భూ భారతి 2025 చట్టాన్ని ప్రారంభించిన రోజు చాలా చారిత్రాత్మకం అని డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సామాన్యుడికి సైతం అర్థమయ్యే విధంగా ఎలాంటి మతలబు, ఇబ్బంది లేకుండా భూ భారత్ 2025 చట్టం రూపొందించామని తెలిపారు. భూమికి మనిషికి విడదీయరాని సంబంధం ఉందని, అనేక పోరాటాల ద్వారా భూమిపై సాధించుకున్న హక్కులను, ఆ హక్కులు కాలరాయకుండా ప్రజలకు అందించాల్సిన బాధ్యత పాలకులపైన ఉందని చెప్పారు. ఆత్మగౌరవం కోసం పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజల జీవితాలను అల్లకల్లోలం చేస్తూ గత పాలకులు ‘

ధరణి చట్టం తెచ్చారని మండిపడ్డారు. ధరణి అనేది రైతుల పాలిట శాపంగా మారిందని, కొంత మంది పెత్తందారుల కాళ్ల వద్ద రైతుల హక్కులను తాకట్టు పెట్టే విధంగా ఉందని ఎంత మొత్తుకున్నా గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు పేదలకు పంపిణీ చేసిన 24 లక్షల ఎకరాలకు సంబంధించిన హక్కులను గత ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి కాలరాసిందని మండిపడ్డారు. తాను చేసిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో అనేక మంది రైతులు తన వద్దకు వచ్చి బిఆర్‌ఎస్ ప్రభుత్వం ధరణి తీసుకొచ్చి తమ భూములపై తమకు హక్కులను లేకుండా చేసిందని చెప్పుకున్నారని గుర్తు చేశారు. ప్రజా ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ చట్టం తమ కోసమే అన్న నమ్మకాన్ని ప్రజల్లో అధికారులు కల్పించాలని కోరారు.

భూభారతి చట్టంతో నా జన్మధన్యం : రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి
తెలంగాణ రాష్ట్ర ప్రజల భూములకు పూర్తి భద్రత, భరోసా కల్పించే భూభారతి చట్టాన్ని ప్రజలకు అందించడంతో తన జన్మధన్యమైందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గత ప్రభుత్వ దొరల హయాంలో నాలుగు గోడల మధ్య నలుగురు కలసి రూపొందించిన 2020 రెవెన్యూ చట్టం- ధరణితో ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా పోయిందని పేర్కొన్నారు. 2020 రెవెన్యూ చట్టం మూడేళ్లలో మురిగిపోగా, 2025 భూభారతి చట్టం వందేళ్లు వర్ధిల్లుతుందని వ్యాఖ్యానించారు. ఈ చట్టాన్ని సమర్ధవంతంగా ప్రజలకు అందించేందుకు గాను 4 జిల్లాల్లోని 4 మండలాలను పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేశామని వెల్లడించారు.

ఖమ్మం, మెహబూబ్‌నగర్, ములుగు, కామారెడ్డి జిల్లాలను ఎంపికచేశామని, అధికారులే ప్రజల వద్దకు వచ్చి సమస్యలు స్వీకరించి 15 రోజుల్లో పరిష్కరిస్తారని తెలిపారు. ఈనెల 17 నుంచి కలెక్టర్లు రాష్ట్రంలో అన్ని మండలాల్లో ఈ చట్టంపై అవగాహనా సదస్సులు నిర్వహిస్తారని చెప్పారు. ఈ చట్టాన్ని ప్రజల కోసం ఇందిరమ్మ ప్రభుత్వం రూపొందించినా దీనిని సమగ్రంగా ప్రజలకు అందించాల్సిన బాధ్యత అధికారులదే అని పేర్కొన్నారు. పేద, దళిత, గిరిజనుల పరిస్ధితులను దృష్టిలో పెట్టుకొని వారికి ఎటువంటి అడ్డంకులు లేకుండా భూభారతిని అమలు చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధికారులను కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News