Wednesday, April 16, 2025

లక్నో పై చెన్నై విజయం

- Advertisement -
- Advertisement -

ఐపిఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ రెండో విజయం సాధించింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఐదు వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్‌ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. ఓపెనర్ మిఛెల్ మార్ష్ 2 ఫోర్లు, రెండు సిక్సర్లతో 30 పరుగులు చేశాడు. ఇక కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన రిషబ్ పంత్ 49 బంతుల్లో 4 సిక్సర్లు, మరో నాలుగు ఫోర్లతో 63 పరుగులు సాధించాడు. అయుష్ బడోని (22), అబ్దుల్ సమద్ (20) తమవంతు పాత్ర పోషించారు.

లక్నో బౌలర్లలో నూర్ అహ్మద్ 4 ఓవర్లలో 13 పరుగులు మాత్రమే ఇచ్చాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 19.3 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు షేక్ రషీద్ (27), రచిన్ రవీంద్ర (37) అద్భుత బ్యాటింగ్‌ను కనబరిచారు. శివమ్ దూబె 2 సిక్స్‌లు, మరో మూడు ఫోర్లతో 43 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన ధోనీ 11 బంతుల్లోనే ఓ సిక్స్, 4 ఫోర్లతో అజేయంగా 26 పరుగులు చేసి చెన్నై విజయంలో తనవంతు పాత్ర పోషించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News