Wednesday, April 16, 2025

దామాషా ప్రకారం రిజర్వేషన్లు

- Advertisement -
- Advertisement -

2026 జనాభా లెక్కల్లో ఎస్‌సిల శాతం ఎంత
పెరిగితే ఆ మేరకు రిజర్వేషన్లు పెంచుతాం
వర్గీకరణను అమలు చేస్తున్న తొలి రాష్ట్రం
తెలంగాణ జీవో జారీ చేసిన ప్రభుత్వం జీవో
ప్రతిని సిఎంకు అందజేసిన మంత్రుల బృందం

మన తెలంగాణ/హైదరాబాద్: ఎస్‌సి ఉపకులా ల దశాబ్దాల కల ఎట్టకేలకు నెరవేరింది. ఎస్‌సి వర్గీకరణకు సంబంధించి న్యాయశాఖ సోమవా రం జిఓ33 జారీ చేసింది. దీంతో రాష్ట్ర వ్యా ప్తం గా ఉన్న ఎస్‌సి ఉప కులాలకు వారి జనాభా క నుగుణంగా రిజర్వేషన్లు అధికారికంగా అమల్లో కి రానున్నాయి. అధికారులు ఆంగ్లము, తెలుగు, ఉర్దూ భాషల్లో గెజిట్ కూడా విడుదల చేశారు. ఎస్‌సిలలో ఉన్న మొత్తం 59 ఉప కులాలను మూ డు గ్రూపులుగా విభజించి కేటాయింపులు చేశా రు. సామాజికంగా, విద్యా పరంగా, ఆర్థికంగా పూర్తిగా వెనుకబడిన వారిలో 15 ఉప కులాలు ఉన్నాయని గుర్తించి గ్రూప్- ఏ కింద ఉన్న వారికి ఒక శాతం రిజర్వేషన్లు కేటాయించారు. అదేవిధంగా మధ్యస్థంగా లబ్ధి పొందిన 18 ఉప కులాలకు గ్రూప్-బి కింద ఉన్న వారికి 9శాతం, మెరుగ్గా లబ్ధిపొందిన 26 ఉప కులాలను గ్రూప్- సి కింద ఉన్న వారికి 5 శాతం రిజర్వేషన్లు వర్తించనున్నాయి. అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఎస్‌సి వర్గీకరణ జిఓను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో మంత్రివర్గ ఉప సంఘం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి జిఓ తొలి కాపీని అందజేసింది.

ఈ సందర్భంగా సచివాలయంలో మంత్రులతో కలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ విద్యా, ఉద్యోగ అవకాశాల్లో ఎస్‌సి వర్గీకరణ అమ లు చేస్తామన్నారు. ఎస్‌సి వర్గీకరణ అమలు చరిత్రాత్మకమైందన్నారు. రాజకీయ జీవితంలో ఎన్నో కీలక ఘట్టాలు చూశానని, ఎస్‌సి వర్గీకరణ కోసం అన్ని పార్టీల వారు మాట్లాడారు కాని ఏ పార్టీ కూడా ఆ దిశగా ప్రయత్నం చేయలేదని అన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎస్‌సి వర్గీకరణ దిశగా ప్రయత్నించామని, అంబేడ్కర్ జయంతిన సామాజిక స్ఫూర్తితో ఎస్‌సి వర్గీకరణను అమలు చేస్తున్నామన్నారు. 2026లో జరిగే జనాభా లెక్కల ప్రకారం ఎస్‌సిలు ఎంత పెరిగితే రిజర్వేషన్లు కూ డా అంత పెంచుతామని చెప్పారు. ఎస్‌సి వర్గీకర ణ అమలు కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందనడానికి మరో నిదర్శనమని అన్నా రు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఎస్‌సి వర్గీకరణ అమలు చేసే మొదటి రాష్ట్రం తెలంగాణ అన్నారు. దళితుల్లో సామాజిక ఆర్థిక, వ్యత్యాసాలు ఉండకూడదని మంత్రి ఉత్తమ్ అన్నారు. మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ దశాబ్దాల ఎస్‌సి వర్గీకరణ ఆకాంక్ష నెరవేరిన సందర్భంగా దళితులందరికీ శుభాకాంక్షలు తెలిపారు., వర్గీకరణ ఏ కులానికి వ్యతిరేకం కాదని,

దళితుల్లో ఉన్న అంతర్గత వెనుకబాటుతనం, అసమానతలను తొలగించేందుకే ఉద్దేవించబడిందన్నారు. సమానత్వం, సామాజిక న్యా యం కోసమే జీవితాంతం పరితపించిన రాజ్యాం గ నిర్మాత, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి నాడు వర్గీకరణ ఆకాంక్ష సంపూర్ణంగా నెరవేరడం సంతోషకరమన్నారు. సిఎం రేవంత్‌రెడ్డి దార్శనికత, కమిట్‌మెంట్ వల్లే వర్గీకరణ ఆకాంక్ష ఇంత త్వరగా సాకారమైందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించిన ఎనిమిదన్నర నెలల కాలంలోనే వర్గీకరణ అమల్లోకి తీసుకొచ్చిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తోందన్నారు. వర్గీకరణ కోసం పోరాడుతూ అసువులు బాసిన అమరవీరులకు నివాళులర్పించారు. వారి త్యాగాలను ఎల్లకాలం గుర్తుంచుకుంటామని, వారి కుటుంబాలకు అండగా నిలుస్తామని అన్నారు. అత్యంత వెనుకబడిన 15 కులాలను గ్రూపు 1లో చేర్చి 1 శాతం రిజర్వేషన్ కేటాయించడం జరిగిందని, వీరికి జనాభా ప్రకా రం 0.5 శాతం రిజర్వేషన్ రావాల్సి ఉన్నప్పటికీ, వారు అత్యంత వెనుకబడి ఉన్నందున ఒక శాతం రిజర్వేషన్లు కల్పించి, వారి అభ్యున్నతికి అండగా నిలవడం జరిగిందన్నారు.

రిజర్వేషన్ల ద్వారా మధ్యస్తంగా ప్రయోజనం పొందిన 18 కులాలను గ్రూపు2లో చేర్చి 9శాతం రిజర్వేషన్ కేటాయించడం జరిగిందని, మెరుగైన ప్రయోజనం పొంది న 26 కులాలను గ్రూప్ 3లో చేర్చి 5 శాతం రిజర్వేషన్ కటాయించడం జరిగిందన్నారు. ఈ రిజర్వేషన్ల ప్రకారమే రాబోయే రోజుల్లో ఉద్యోగాల భర్తీ జరుగుతుందన్నారు. త్వరలోనే ఉద్యోగ నోటిఫికేషన్లు రానున్నాయని, ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని ఉద్యోగాలను సాధించుకునేందుకు యువత సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు పొన్నం ప్రభాకర్, సీతక్క తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News