- Advertisement -
అంబటి రాయుడు
న్యూఢిల్లీ: ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ బ్యాటర్ కరుణ్ నాయర్ విధ్వంసక ఇన్నింగ్స్‌తో అలరించిన సంగతి తెలిసిందే. ఈ సీజన్‌లో కరుణ్ నాయర్‌కు ఇదే తొలి మ్యాచ్ కావడం గమనార్హం. అయితే ఆడిన మొదటి మ్యాచ్‌లోనే నాయర్ కళ్లు చెదిరే ఇన్నింగ్స్‌కు ఆకట్టుకున్నాడు. ముంబై బౌలర్లను హడలెత్తించిన నాయర్ సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. అతనిపై టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ప్రశంసలు కురిపించాడు. కొంత కాలంగా కరుణ దేశవాళీ క్రికెట్‌లో అత్యంత నిలకడైన బ్యాటింగ్‌ను కనబరుస్తున్నాడని, రానున్న ఇంగ్లండ్ సిరీస్‌లో అతనికి చోటు కల్పించాలని రాయుడు సూచించాడు. కరుణ్‌లో అపార బ్యాటింగ్ నైపుణ్యం దాగివుందన్నాడు. దీనికి ముంబైపై అతను ఆడిన ఇన్నింగ్సే నిదర్శనమన్నాడు. మిగిలిన మ్యాచుల్లోనూ ఇదే జోరును కొనసాగించాలని రాయుడు సలహా ఇచ్చాడు.
- Advertisement -