నేచురల్ స్టార్ నాని తన అప్ కమింగ్ ‘హిట్: ది థర్డ్ కేస్’లో మోస్ట్ ఇంటెన్స్ అండ్ వయోలెంట్ అవతార్‌లో కనిపించనున్నారు. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని, నాని యూనానిమస్ ప్రొడక్షన్స్‌తో కలిసి నిర్మించారు. ఈ సినిమా మే 1న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ సోమవారం వైజాగ్ సంగమ్ థియేటర్ లో భారీగా తరలివచ్చిన అభిమానులు సమక్షంలో లాంచ్ చేశారు. అనంతరం హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్ లో నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ “ఈ మధ్యకాలంలో చివరి నిమిషంలో ట్రైలర్స్ ఇస్తున్నారు. ఇంతకుముందు 20 రోజులు ముందు ట్రైలర్ వచ్చేది.
ఆ ఫీలింగ్ మళ్లీ ఇద్దామని ట్రైలర్‌ని ముందుగానే రిలీజ్ చేశాము. ట్రైలర్ కోసం టీం అంతా డే అండ్ నైట్ పనిచేసింది.-ఎమోషన్ బలంగా ఉన్నప్పుడు వయోలెన్స్ పండుతుంది. ఈ సినిమాలో వయోలెన్స్ చూస్తున్నప్పుడు పూనకం వస్తుంది. దానికి కారణం ఆ సీన్స్‌లో వుండే ఎమోషన్. యాక్షన్ డిజైన్ సరికొత్తగా వుంటుంది. ఈ సినిమాలో యాక్షన్ కొరియోగ్రఫీకి చాలా ప్రాధాన్యత వుంటుంది. లీ చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. ఇది చాలా డిఫరెంట్ జోనర్ మూవీ”అని అన్నారు. డైరెక్టర్ శైలేష్ కొలను మాట్లాడుతూ “ట్రైలర్‌ను యూనిక్‌గా క్రియేట్ చేశాము. సినిమాలో అర్జున్‌ది లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్. -ఈ సినిమాలో మంచి మెసేజ్ కూడా వుంది. ధర్మం కోసం నిలబడ్డ మనిషి ఎంత దూరం వెళ్ళాడనేది ఇందులో చూస్తారు. చాలా డిఫరెంట్ ఫిల్మ్ ఇది”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఓపి సాను జాన్ వర్గీస్, ప్రొడక్షన్ డిజైనర్ నాగేంద్ర పాల్గొన్నారు.