Thursday, April 17, 2025

పీడితుల పక్షపాతి బాబాసాహెబ్

- Advertisement -
- Advertisement -

అంబేద్కర్ బోధించు, సమీకరించు, పోరాడు అనే నినాదా లతో అందరినీ సంఘటితం చేశాయి. అస్పృశ్యత, అంటరా నితనం వంటి సమస్యల పరిష్కారంలో గాంధీతో అంబేద్కర్ విభేదించారు. భారత రాజ్యాంగ రచన కమిటీకి అధ్యక్షత వహించి అన్నివర్గాల ప్రజల ఆకాంక్షలను అందులో చేర్చి భారత రాజ్యాంగ పితగా వెలుగొందారు. పీడనకు గురైన వర్గాలకు రిజర్వేషన్స్ కల్పించా రు. అగ్రకులాల కుట్రలు ఛేదించి అందిరికీ ఓటు హక్కును కల్పించారు. స్వాతం త్య్రానంతరం నెహ్రూమంత్రివర్గంలో న్యాయశాఖ మంత్రిగా స్త్రీల ఆస్తి హక్కుకోసం పోరాడారు.

భారతదేశంలో అనాదిగా పాతుకుపోయిన కులవ్యవస్థ, అంటరానితనం, అస్పృశ్యత అనే అనాగరిక శిక్షలు బడుగు, బలహీనవర్గాలను దీనస్థితికి దిగజార్చాయి. ఇలాంటి సమాజంలో పుట్టిన ఓ ధ్రువతార డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన 1891 ఏప్రిల్ 14న మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలోని అంబేవాడలో జన్మించాడు. అంటరాని ‘మహర్ కులం’లో పుట్టి బాల్యం దశలో అనేక అవమానాలకు ఎదుర్కొన్నారు. బరోడా మహారాజు ఆర్థిక సహాయంతో విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించారు. అనంతరం భారతదేశానికి తిరిగి వచ్చి ఆయన ఆ స్థానంలోనే ఉద్యోగంలో చేరారు. ఆఫీసులో నౌకర్లు అస్పృశ్యుడుగా చూడడం పెద్ద అవమానంగా భావించారు. దీంతో సామాజిక వివక్షపై పోరాడాలని సంకల్పించారు.

దళితల మంచినీటికోసం మహారాష్ట్రలోని నాసిక్‌లో చేసిన ‘మహాద్ చెరువు’ పోరాటం అందరి దృష్టిని ఆకర్షించించింది. ఇది భారతదేశంలోనే మొదటి మానవ హక్కుల ఉద్యమం. ఆలయాల ప్రవేశాలు, పాఠశాలలో చదువు, తాగునీరు బడుగు, బలహీన వర్గాలకు అందాలని పట్టుపట్టారు. 1927లో సైమన్ కమిషన్ ముందు దళిత జాతి సమస్యలను మొట్టమొదిసారిగా నివేదించారు. అంతేకాకుండా అంబేద్కర్ ‘అఖిల భారత దిగువ కులాల సమైక్య’ ను స్థాపించి వారి ఉన్నతికై పోరాటం చేశారు. ఇంగ్లాండులో మూడు రౌండ్ టేండ్ సమావేశాల్లో పాల్గొని దళితుల సమస్యలను బ్రిటిష్‌వారి దృష్టికి తీసుకెళ్లారు. అంబేద్కర్ ‘బహిష్కృత భారతీ’ అనే పత్రికలో తిలక్ అంటరానివాడిగా పుట్టి ఉంటే ‘స్వరాజ్యం నా జన్మ హక్కు’ అనే వారు కాదు, ‘అస్పృశ్యత నివారణ నా జన్మ హక్కు’ని నినాదించేవాడని రాశారు. ఇది ఆనాడు భారతీయ సమాజంలో కులతత్వ వాదులచే అంబేద్కర్ అనుభవించిన బాధను తెలుపుతుంది.

1924లో సమానత్వ సాధనకై ‘సమతా సైనిక్ దళ్’ అనే సంస్థను ఏర్పాటు చేశారు. యువతలో వ్యక్తిగత క్రమశిక్షణ నేర్పిస్తూ, అగ్రకులదాడులను ఎదుర్కొనే విధంగా తయారు చేశారు. ‘మూక్ నాయక్’ అనే పత్రికను నడిపి ‘దేశ మూలవాసుల చరిత్ర’ను వెలికితీశారు. అంబేద్కర్ బోధించు, సమీకరించు, పోరాడు అనే నినాదాలతో అందరినీ సంఘటితం చేశాయి. అస్పృశ్యత, అంటరానితనం వంటి సమస్యల పరిష్కారంలో గాంధీతో అంబేద్కర్ విభేదించారు. భారత రాజ్యాంగ రచన కమిటీకి అధ్యక్షత వహించి అన్నివర్గాల ప్రజల ఆకాంక్షలను అందులో చేర్చి భారత రాజ్యాంగ పితగా వెలుగొందారు. పీడనకు గురైన వర్గాలకు రిజర్వేషన్స్ కల్పించారు. అగ్రకులాల కుట్రలు ఛేదించి అందిరికీ ఓటు హక్కును కల్పించారు. స్వాతంత్య్రానంతరం నెహ్రూమంత్రివర్గంలో న్యాయశాఖ మంత్రిగా స్త్రీల ఆస్తి హక్కుకోసం పోరాడారు.

ఈ విధంగా ఆయన అన్ని వర్గాల ప్రజల సమస్యలను స్పృశించారు. జీవిత చరమాంకంలో అంబేద్కర్ నా పుట్టుక నా చేతిలో లేదు కానీ, నా చావు నా చేతిలో ఉందని ప్రకటించి హిందూ మతాన్ని వీడి మానవీయ విలువలతో కూడిన బౌద్ధాన్ని స్వీకరించారు. 1956 డిసెంబర్ 6న తుది శ్వాస విడిచారు. అంబేద్కర్ పోరాట దిశగా.. నేడు ప్రతి వ్యక్తికి అమ్మ జన్మనిస్తే.. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం జీవితాన్ని ప్రసాదిస్తుంది. ఆయన సామాజిక, ఆర్థిక, రాజకీయ అంతరాలపై లక్ష పేజీల సాహిత్యాన్ని మనకు అందించిన బహుముఖ ప్రజ్ఞాశాలి. సామాజిక ఆసమానతలపై అలుపెరుగని పోరాటం చేసిన ఉద్యమకారుడు. అందుకే ఐక్యరాజ్య సమితి అంబేద్కర్‌ను ప్రపంచ మేధావులలో ఒకరిగా గుర్తించింది. ఆయన జయంతిని ‘ప్రపంచ విజ్ఞాన దినోత్సవం’గా ప్రకటించింది. కానీ, ఇప్పటికీ ఆయనను దళిత నాయకుడుగా సమాజం కీర్తించడం బాధాకరం. అన్నివర్గాలకు హక్కులు కల్పించిన విశ్వమానవుడు.

నేడు మనమంతా రాజ్యాంగం కల్పించిన హక్కులతో విలాస జీవితాలు అనుభవిస్తున్నాము తప్ప, ఆయన ఉద్యమ రథాన్ని ముందుకు తీసుకెళ్లడంలో విపలమవుతున్నాం. దీంతో అన్ని రంగాలలో ఇంకా అగ్రకుల ఆధిపత్యమే కొనసాగుతుంది. దేశంలో 90 శాతం ఉన్న బిసి, ఎస్‌సి, ఎస్‌టి కులాలు సామాజిక, ఆర్థిక, రాజకీయ స్రవంతికి ఆమడ దూరంలోనే ఉన్నారు. ప్రస్తుతం మనల్ని కాపాడే భారత రాజ్యాంగ ఉనికికే ప్రమాదం పొంచి ఉంది. అగ్రవర్ణ పార్టీలన్నీ ఏకమై రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బ తీస్తున్నారు. దేశంలో రాజ్యాంగ రక్షకులు ఒకవైపు.. రాజ్యాంగాన్ని మార్చేశక్తులు మరొకవైపుగా రాజకీయ యుద్ధం కొనసాగుతున్నది. అయినప్పటికీ ఇంకా మెజారిటీ జనాభా గల బిసి, ఎస్‌సి, ఎస్‌టి నాయకులు అగ్రవర్ణ ఆధిపత్య పార్టీల పక్షాననే నిలబడడమేంటి? అగ్రవర్ణ పార్టీలిచ్చే పదవులు, సంక్షేమ పథకాలు కాదు. ప్రజలు ఓటనే ఆయుధంతో రాజ్యాధికార యుద్ధ్దం చేయాలి. తమ బానిస సంకెళ్లు తెంపుకొని వారే పాలకులు కావాలి. అప్పుడే దేశ సంపద ప్రజాస్వామ్యికీకరించబడుతుంది. స్వేచ్ఛ,సమానత్వం, సోదరభావం అనే రాజ్యాంగ స్ఫూర్తి కొనసాగుతుంది. అంబేద్కర్ కోరుకున్నది కూడా అదే.

– సంపతి రమేష్ మహారాజ్ -79895 79428

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News