Wednesday, April 16, 2025

వర్షిణీని పెళ్లి చేసుకున్న లేడీ అఘోరీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: లేడీ అఘోరీ అలియాస్ శ్రీనివాస్ ఓ యువతిని పెళ్లి చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వర్షిణీ అనే యువతిని లేడీ అఘోరీ పెళ్లి చేసుకుంది. మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని ఓ దేవాలయంలో వర్షిణీ మెడలో అఘోరీ తాళి కట్టడంతో పాటు దండాలు మార్చుకున్న దృశ్యాలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి. పలువురు భక్తులు పాటలు పాడుతూ సదరు జంటను ఆశీర్వదించారు. నందిగామలో లేడీ అఘోరీ వివస్త్రంగా ఉన్న సమయంలో వర్షిణీ దుస్తులు తొడిగింది.

దీంతో ఇద్దరు మధ్య పరిచయం కాస్తా ప్రేమగా మారింది. వర్షిణీని అఘోరీ గుజరాత్‌లోని పలు ప్రాంతాలకు తీసుకెళ్లాడు. అదే సమయంలో వర్షిణీ తల్లిదండ్రులు ఎపి, తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి వర్షిణీని పట్టుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. కొన్ని రోజుల ఇంట్లో ఉన్న వర్షిణీ మళ్లీ లేడీ అఘోరీతో వెళ్లిపోయింది. లేడీ అఘోరీ జనవరి 1న తనని పెళ్లి చేసుకున్నాడని మరో యువతి ఆరోపణలు చేసింది. జనవరి 13న వర్షిణీని లేడీ ఆఘోరీ పెళ్లి చేసుకుందని సదరు యువతి ఆరోపణలు చేసింది. మొదటి భార్య ఉండగా రెండో పెళ్లి ఎలా చేసుకుంటుందని యువతి ప్రశ్నిస్తోంది. ఎపి, తెలంగాణ పోలీసులు లేడీ ఆఘోరీపై చర్యలు తీసుకోవాలని సదరు యువతి డిమాండ్ చేస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News