- Advertisement -
హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆరు ప్లాట్‌ఫామ్‌లు మూసివేయనున్నారు. రైల్వే స్టేషన్ ఆధునీకరణలో భాగంగా ఆరు ప్లాట్‌ఫామ్‌లు క్లోజ్ చేయనున్నారు. చర్లపల్లి, కాచిగూడ, నాంపల్లికి పలు రైళ్లను మళ్లించనున్నారు. 100 రోజుల పాటు ఆరు ప్లాట్‌ఫామ్‌లు మూసివేయనున్నారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పునర్ నిర్మాణం చేయనున్నారు. పునర్ నిర్మాణం పనులలో భాగంగా భారీ స్కై, కాంకోర్స్ లిప్టులు, ఎస్కలేటర్లు , ఫుట్ ఓవర్ వంతెనలు నిర్మిస్తున్నారు. మంగళవారం నుంచి పలు రైళ్లను కాచిగూడ, నాంపల్లి, చర్లపల్లి రైల్వే స్టేషన్లకు మళ్లించనున్నారు. సింహభాగం చర్లపల్లి టెర్మినల్ నుంచి రైళ్ల రాకపోకలు సాగనున్నాయి.
- Advertisement -