Saturday, April 19, 2025

పోక్సో కేసు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు

- Advertisement -
- Advertisement -

పోక్సో కేసులో బాంబే హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. మైనర్ అయిన తన కూతురిపై అత్యాచారం చేశాడంటూ ఆరోపిస్తూ.. ఓ యువకుడిపై బాలిక తండ్రి పెట్టిన పోక్సో కేసులో బాంబే కోర్టు కీలక తీర్పు ఇచ్చింది.

2020లో నవీ ముంబైకి చెందిన 15 సంవత్సరాల బాలిక, యూపీకి చెందిన 22 సంవత్సరాల యువకుడితో కలిసి ఇంటి నుండి పారిపోయింది. 10 నెలల తరువాత బాలిక గర్భంతో ఇంటికి తిరిగి వచ్చింది. దీంతో అమ్మాయి తండ్రి.. ఆ యువకుడిపై పోక్సో కేసు పెట్టాడు. ఈ కేసులో విచార చేపట్టిన బాంబే హైకోర్టు.. ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం.. “బాలిక తన ఇష్ట ప్రకారమే యువకుడితో వెళ్ళింది. ఆమెకు ఏం జరుగుతుందో తెలుసు” అని చెబుతూ యువకుడికి బెయిల్ మంజూరు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News