- Advertisement -
ముంబై: టీం ఇండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. 2013లోనే ఆయనకు గుండెకు రెండుసార్లు శస్త్ర చికిత్స జరిగింది. అప్పుడు సచిన్ టెండూల్కర్ సహాయం చేశారు. తాజాగా టీం ఇండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కాంబ్లీకి సహాయం అందించేందుకు ముందుకు వచ్చారు.
వినోద్ కాంబ్లీకి 1983 ప్రపంచకప్ విజేతగా నిలిచిన జట్టు సభ్యులు సహాయం అందిస్తారని గవాస్కర్ మాట ఇచ్చారు. తాజాగా ‘ఛాంప్స్’ అనే ఫౌండేషన్ ద్వారా కాంబ్లీకి సహాయం అందిస్తున్నారు. ఇందులో ఆయనకు ప్రతీ నెల రూ.30 వేలు అర్థిక సహాయం అందనుంది. అంతేకాకుండా.. వైద్య అవసరాల కోసం ఏడాదికి మరో రూ.30 వేలు అదనంగా ఇవ్వనున్నారు. యూరినరీ ఇన్‌ఫెక్షన్, ఇతర ఇబ్బందులతో కాంబ్లీ గత డిసెంబర్‌లో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే.
- Advertisement -