Wednesday, April 16, 2025

‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బద్దలు కొట్టిన నాని..

- Advertisement -
- Advertisement -

వరుస సినిమాలతో జోరుమీదున్నారు నాచురల్ స్టార్ నాని. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రం ‘హిట్‌: ది థర్డ్‌ కేస్‌’. శైలేశ్‌ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ ట్రైలర్ నిన్న విడుదలైంది. యాక్షన్ థ్రిల్లర్ వస్తున్న ఈ సినిమా ట్రైలర్ రికార్డు వ్యూస్ తో దూసుకుపోతోంది. యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ట్రెండింగ్ లో ఉంది.

ఈ క్రమంలో హిట్ 3 ట్రైలర్.. 24 గంటల్లో 21.30 మిలియన్స్ వ్యూస్ సాధించి.. ఆర్ఆర్ఆర్ రికార్డు బద్దలు కొట్టింది. ఆర్ఆర్ఆర్ ట్రైలర్ 24 గంటల్లో 20.45 మిలియన్స్ వ్యూస్ మాత్రమే సాధించింది. కాగా, అత్యధిక వ్యూస్ సాధించిన తెలుగు మూవీ ట్రైలర్ రికార్డు పుష్ప 2 పేరిట ఉంది. ఈ మూవీ ట్రైలర్ 44.67 మిలియన్స్ వ్యూస్ సాధించింది. కాగా, హిట్ 3 ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఇది సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. సమ్మర్ కానుకగా ఈ మూవీ మే1న తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News