Monday, April 28, 2025

జాతీయ అధ్యక్షుడి ప్రతిపాదనల్లో నా పేరు లేదు: కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకు వారం రోజులు పట్టే అవకాశం ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకు తొందరేమి లేదని అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేరళ, తమిళనాడు అధ్యక్షులను ప్రకటించారని చెప్పారు. జాతీయ అధ్యక్షుడి ప్రతిపాదనల్లో నా పేరు లేదని తెలియజేశారు. తమిళనాడులో ఎన్డీఏను పునరుద్ధరించారని, తెలంగాణాలోనూ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నామన్నారు. నియోజక వర్గాల పునర్విజనపై ఎక్కడైనా చర్చ జరిగిందా? అని ప్రశ్నించారు. భూములు, మద్యం విక్రయం, అప్పులతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారని విమర్శించారు. భూముల అమ్మకం బిఆర్ఎస్ తో కాంగ్రెస్ పోటీపడుతోందని చురకలంటించారు. హెచ్ సియు అంశంలో తనపై కేసు పెడితే ఎదుర్కోవడానికి తాను సిద్ధమని కిషన్ రెడ్డి సవాల్ విసిరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News