- Advertisement -
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. రెండు మూడు రోజులుగా ఎండలు దంచికొట్టగా.. మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం చల్లబడి సిటీలోని పలు చోట్ల వాన పడుతోంది. నగరంలోని కూకట్ పల్లి, ఎస్‌ఆర్‌నగర్, అమీర్‌పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకాపూల్, హిమాయత్‌నగర్, నారాయణగూడ, బషీర్‌బాగ్, అబిడ్స్, కోఠి, మలక్ పేట్, దిల్ సుఖ్ నగర్ ప్రాంతాల్లో వర్షం పడుతోంది. మరికొన్ని చోట్ల ఈదురుగాలులతో వర్షం కురుస్తోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.
- Advertisement -