Wednesday, April 16, 2025

పైశాచికం: వృద్ధురాలిని హత్య చేసి.. ఆపై డ్యాన్స్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలోని కుషాయిగూడలో దారుణం చోటు చేసుకుంది. ఒంటరిగా ఉన్న కమలాదేవి అనే వృద్ధురాలిని ఉరి వేసి హత్య చేశాడు ఓ యువకుడు. వృద్ధురాలిని హత్య చేసి.. ఆపై మృతదేహంపై డ్యాన్స్‌లు చేశాడు. ఆ దృశ్యాన్ని సెల్ఫీ వీడియో తీసి తన మిత్రులకు షేర్ చేశాడు. వివరాల్లోకి వెళితే.. మీర్‌పేట హెపి కాలనీలోని బాలాజీ హార్డ్‌వేర్ షాపు యజమానురాలు కమలాదేవీ అద్దె విషయంలో యువకుడిని మందలించింది. దీంతో ఆ యువకుడు ఈ నెల 11వ తేదీన ఆమెను హత్య చేసి మృతదేహాన్ని ఇంట్లో ఉంచి తాళం వేసి పారిపోయాడు. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. నిందితుడు పంపిన వీడియో వైరల్ అయింది. ఈ కేసులో పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరు మైనర్‌గా పోలీసులు గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News