Sunday, April 27, 2025

సిఎం రేవంత్ కు తప్పిన ప్రమాదం..

- Advertisement -
- Advertisement -

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. సిఎల్పీ సమావేశం నేపథ్యంలో శంషాబాద్ లోని నోవాటెల్ హోటల్‌లో సీఎం రేవంత్ రెడ్డి లిఫ్ట్ లో ఇరుక్కుపోయారు. సిఎం ఎక్కిన లిఫ్ట్‌లో స్వల్ప సాంకేతిక సమస్య ఏర్పడింది. ఎనిమిది మంది ఎక్కాల్సిన లిఫ్ట్‌లో 13 మంది ఎక్కడంతో మధ్యలోనే ఆగిపోయింది. లిఫ్ట్ ఆగాల్సిన చోటు కంటే రెండు అడుగుల దూరం ముందే ఆగిపోయింది. దీంతో వెంటనే అలర్ట్ అయిన హోటల్ సిబ్బంది, సీఎం సెక్యూరిటీ అధికారులు లిఫ్ట్ డోర్ ఓపెన్ చేసి.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News