కోలీవుడ్ స్టార్ హీరో అజిత్, డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ కాంబినేషన్ లో వచ్చిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమా సూపర్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ క్రమంలో లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా.. మూవీ మేకర్స్ కు బిగ్ షాక్ ఇచ్చారు. తన పాటలను ఈ సినిమాలో వాడుకున్నారని.. తన పర్మిషన్ లేకుండా మూడు సాంగ్స్ సినిమాలో పెట్టినందుకు రూ.5కోట్లు పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తూ.. నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌కు నోటీసులు పంపించారు. కాగా, గతంలో మలయాళ సూపర్ హిట్ మూవీ మంజుమ్మెల్ బాయ్స్ సినిమాలో తన సాంగ్ వాడుకున్నందుకు ఇళయరాజా మేకర్స్‌కు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.
కాగా, యాక్షన్ థ్రిల్లర్ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా.. ఈ నెల 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై భారీ కలెక్షన్స్ రాబడుతోంది. తొలిరోజే రూ.30 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా.. కేవలం మూడు రోజుల్లోనే వంద కోట్ల మార్కు దాటేసింది. దీంతో చాలా రోజుల తర్వాత అజిత్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు.