- Advertisement -
తిరుమల: తిరుమలలో మరో అపచారం జరిగింది. ఓ వ్యక్తి డ్రోన్ కెమెరాతో శ్రీవారి ఆలయంపై షూటింగ్ చేశాడు. ఇది గమనించిన భక్తుల టిటిడి విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే అధికారులు మహారాష్ట్రకు చెందిన ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అ తర్వాత అతన్ని పోలీసులకు అప్పగించారు. శ్రీవారి ఆలయంపై డ్రోన్ ఎగరవేసి సదరు వ్యక్తి 15 నిమిషాల పాటు చిత్రీకరించినట్లు గుర్తించారు.
కాగా, కొద్ది రోజుల క్రితమే తిరుమలలో ఘోర అపచారం జరిగిన విషయం తెలిసిందే. ముగ్గురు వ్యక్తులు పాద రక్షలతో ఆలయం వరకూ వచ్చారు. సిబ్బంది వారిని గుర్తించి పాద రక్షలు విప్పించారు. కొండపై ఇలాంటి ఘటనలు జరుగుతుండటంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు.
- Advertisement -