వికారాబాద్ జిల్లా తాండూరు మండలం కరణ్ కోట గ్రామంలోని సిసిఐ టౌన్షిప్ వద్ద వెలసిన ఎస్‌బిఐ బ్యాంకులో మంగళవారం ఉదయం 9 గంటల 20 నిమిషాలకు విద్యుత్ షార్ట్‌సర్యూట్‌తో మంటలు వ్యాపించాయి. గమనించిన సిసిఐ సెక్యురిటీ గార్డులు తాండూర్ ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించారు. అంతలోనే బ్యాంక్ అంతా మంటలు వ్యాపించి ఫర్నిచర్‌కు అంటుకొని మంటలు చెలరేగాయి. రెండు ట్యాంకులతో మంటలు అదుపు చేసిన తర్వాత కూడా మంటలు రేగడంతో మరో ఫైర్ ఇంజన్ కోసం కొడంగల్ అధికారులకు సమాచారం అందించడంతో హడావిడిగా కొడంగల్ నుండి ఫైర్ ఇం జన్ తీసుకొచ్చారు. ఫైర్ ఇంజన్ వచ్చిన తర్వాత మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే రెండు గం టల సమయం కావడంతో ఉన్న ఫర్నిచర్ కంప్యూటర్స్ మొత్తం ఖాళీ బూడిద అయిపోయాయి. లాకర్ రూమ్ డాక్యుమెంట్ డబ్బులకు ఎలాంటి ప్రమాదం సంభవించలేదని బ్యాంకు ప్రాపర్టీ ఫర్నిచర్ సుమారు రూ. 60 లక్షల వరకు కాళీ బూడిద అయిపోయిందని బ్యాంకు మేనేజర్ భువన్ తెలిపారు.
కరణ్‌కోట ఎస్ బిఐ బ్యాంకులో అగ్నిప్రమాదం
- Advertisement -
- Advertisement -
- Advertisement -