శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. జోనల్ కార్యాలయంలో అర్బన్ బయోడైవర్సిటీ డిప్యూటి డైరెక్టర్ శ్రీనివాస్ గదిలో ఎసిబి డిఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు. చంద్రాయణగుట్ట సర్కిల్‌లో అర్బన్ బయోడైవర్సిటీ విభాగం ఇన్‌చార్జీగా విప్పర్ల శ్రీనివాస్ వ్యవహరిస్తున్నారు.. చంద్రాయణగుట్ట సర్కిల్‌లో ఓ పనికి సంబంధించి కాంట్రాక్టర్ వద్ద అధికారి రూ. 2 లక్షల లంచం డిమాండ్ చేయడంతో గతంలో లక్ష 50 వేలు లంచం తీసుకున్నాడు. మిగిలిన రూ. 70 వేలను మంగళవారం జోనల్ కార్యాలయంలోని బయోడైవర్సిటీ గదిలో తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు.
విప్పర్ల శ్రీనివాస్ నుండి తీసుకున్న లంచం డబ్బులను స్వాధీనం చేసుకుని నోట్ల కట్టలకు రసాయన పరీక్షలు చేయగా కుడి చేతి వేళ్లు పాజిటివ్‌గా వచ్చాయని తెలిపారు. అనంతరం ఏసీబీ డిఎస్పీ శ్రీధర్ మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు ఎవరైన లంచం అడినట్లయితే అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి ఫిర్యాదు చేయాలన్నారు. బయోడైవర్సిటీ డిప్యూటీ డైరెక్టర్ విప్పర్ల శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఎవరైన ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్ చేస్తే ఎసిబి టోల్ ఫ్రీ నెంబర్ 1064, వాట్సాప్ నెంబర్ 9440446106లకు సమాచారం అందించాలన్నారు. బాధితుల వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.