ఐపిఎల్‌లో భాగంగా సోమవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 16 పరుగుల తేడాతో చిరస్మరణీయ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 15.3 ఓవర్లలో 111 పరుగులకే కుప్పకూలింది. అయితే తర్వాత లక్షఛేదనకు దిగిన కోల్‌కతాను పంజాబ్ బౌలర్లు 15.1 ఓవర్లలో 95 పరుగులకే కుప్పకూల్చి జట్టుకు అద్భుత విజయం సాధించి పెట్టారు. స్వల్ప లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతాకు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. ఓపెనర్లు డికాక్ (2), సునీల్ నరైన్ (5)లు సింగిల్ డిజిట్ స్కోరుకే ఔటయ్యారు.
కెప్టెన్ అజింక్య రహానె (17) కూడా నిరాశ పరిచాడు. అంగరిష్ రఘువంశీ (37) ఒక్కడే కాస్త మెరుగైన బ్యాటింగ్‌ను కనబరిచాడు. వెంకటేశ్ అయ్యర్ (7), రింకూ సింగ్ (2) విఫలమయ్యారు. రమణ్‌దీప్ సింగ్ (0), వైభవ్ అరోరా (0), హర్షిత్ రాణా (3) కూడా తేలిపోయారు. రసెల్ (17) కాస్త పోరాడినా ఫలితం లేకుండా పోయింది. పంజాబ్ బౌలర్లలో చాహల్ నాలుగు, జాన్సన్ మూడు వికెట్లు తీశారు. అంతకుముందు పంజాబ్ కూడా తక్కువ స్కోరుకే పరిమితమైంది. ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్య (22), ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (30)లు మాత్రమే కాస్త రాణించారు.