- Advertisement -
కాబూల్: ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం సంభవించింది. బుధవారం తెల్లవారుజామున 4.43 గంటలకు ఆఫ్ఘనిస్తాన్‌లో 5.9 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది. ఈ భూకంపం సుమారు 55 కిలో మీటర్ల దూరంలో 75 కిలోమీటర్ల లోతులో నమోదైందని వెల్లడించింది. ఈ ఘటనలో ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది. ఆఫ్గాన్ లో సంభవించిన భూ ప్రకంపనలు ఇండియాను తాకాయి. దేశ రాజధాని ఢిల్లీతోపాటు పలు ప్రాంతాల్లో ఈ ప్రకంపనలు వచ్చాయి.
- Advertisement -