Wednesday, April 16, 2025

కళ్యాణ్ గొప్ప మనసుతోనే అద్భుతమైన సినిమా వస్తోంది

- Advertisement -
- Advertisement -

నందమూరి కళ్యాణ్ రామ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ఈ చిత్రంలో విజయశాంతి పవర్‌ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించి ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్ బ్యానర్‌లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు. ఈ సినిమా ఏప్రిల్ 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు విలేకరులు సమావేశంలో మాట్లాడుతూ “కళ్యాణ్ రామ్‌తో ఒక మాస్ కమర్షియల్ సినిమాని చేయాలని ఈ కథని సిద్ధం చేయించాం. కథ ఆలోచన దగ్గర నుంచి ప్రతిదీ కళ్యాణ్ రామ్ కోసం తయారుచేసినవే. మదర్ క్యారెక్టర్‌ను విజయశాంతి చేయాలని ముందే ఫిక్స్ అయ్యాం. అన్ని ప్లాన్ చేసుకుని చేసిన సినిమా ఇది.

మంచి ఎమోషనల్ యాక్షన్ ఫిల్మ్ ఇది. -దర్శకుడు ప్రదీప్ హై ఎమోషన్ వున్న ఈ సినిమాని అద్భుతంగా తీశారు. విజయశాంతి ఈ సినిమాలో చాలా పవర్‌ఫుల్ రోల్ చేశారు. -మేము అనుకున్న దాని కంటే సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. -సినిమా ఫస్ట్ చూసింది ఎన్టీఆర్. ఆయన చూసిన తర్వాత… ఎమోషనల్ యాక్షన్ బెస్ట్ ఉందని చెప్పారు. అజినీష్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. ఎన్టీఆర్ చెప్పినట్లు చివరి ఇరవై నిముషాలు కళ్ళు చెమ్మగిల్లెలా వుంటుంది. ఎన్టీఆర్ చెప్పినట్టు సినిమా కచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది. -ఈ సినిమా కథని ఒప్పుకోవడం కళ్యాణ్ రామ్ గొప్పతనం. తల్లి పాత్రకు ఇంత ప్రాధాన్యత ఇవ్వడం అనేది మామూలుగా జరగదు. కళ్యాణ్ గొప్ప మనసుతోనే ఇలాంటి సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్‌కి సోహెల్ ఖాన్‌ని తీసుకోవాలని ఆలోచన డైరెక్టర్‌ది. తను అద్భుతంగా నటించాడు”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News