వెంటిలేటర్‌పై ఉన్న ఎయిర్ హోస్టెస్‌పై లైంగిక దాడి పాల్పడ్డ దారుణ సంఘటన హర్యానాలో చోటుచేసుకుంది. గురుగ్రామ్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి సిబ్బంది.. ఐసియులో వెంటిలేటర్‌లో ఉన్న ఎయిర్ హోస్టెస్ పై లైంగిక దాడికి పాల్పడ్డారని పోలీసులు మంగళవారం తెలిపారు. 46 ఏళ్ల మహిళ తాను బస చేసిన హోటల్‌లోని స్విమ్మింగ్ పూల్ లో ఈత కొట్టిన తర్వాత అస్వస్థతకు గురవడంతో ఏప్రిల్ 5న బాధితురాలు గురుగ్రామ్ ఆసుపత్రిలో చేరిందని అధికారులు తెలిపారు. నిందితుడిని గుర్తించడానికి ఆసుపత్రిలోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
ఏప్రిల్ 13వ తేదీ ఆదివారం డిశ్చార్జ్ అయిన బాధితురాలు తన భర్తకు జరిగిన విషయం చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేసిది. “ఏప్రిల్ 6న, నేను వెంటిలేటర్‌లో ఉన్నప్పుడు కొంతమంది ఆసుపత్రి సిబ్బంది నాపై లైంగిక దాడి చేశారు” అని ఆమె ఫిర్యాదులో వెల్లడించింది. ఎయిర్ హోస్టెస్ ఫిర్యాదు ఆధారంగా.. సోమవారం ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై గురుగ్రామ్ పోలీసు అధికారి మాట్లాడుతూ.. “బాధితురాలి వాంగ్మూలాన్ని కోర్టులో మేజిస్ట్రేట్ ముందు నమోదు చేశాము. పోలీసు బృందం ఆసుపత్రిలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తోంది. త్వరలోనే నిందితులను గుర్తిస్తుంది” అని అన్నారు. ఈ కేసుపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని, నిందితులను త్వరలో అరెస్టు చేస్తామని హామీ ఇస్తున్నట్లు అధికారి తెలిపారు.