మన తెలంగాణ/హైదరాబాద్: ఐపిఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పేలవమైన ప్రదర్శనకు బౌలింగ్ వైఫల్యం కూడా ప్రధాన కారణమని చెప్పొచ్చు. కమిన్స్, మహ్మద్ షమి వంటి ప్రపంచ స్థాయి బౌలర్లు ఉన్నా సన్‌రైజర్స్‌కు ఎలాంటి ప్ర యోజనం లేకుండా పోతోంది. కెప్టెన్‌కమిన్స్ కాస్త బాగనే బౌలింగ్ చేస్తున్నా సీనియర్ బౌలర్ మాత్రం ఘోర వైఫల్యం చవిచూస్తున్నాడు.
దాదాపు ప్రతి మ్యాచ్‌లోనూ చెత్త బౌలింగ్‌తో నిరాశ పరుస్తున్నాడు. తాజాగా పంజాబ్‌తో జరిగిన మ్యా చ్‌లో నాలుగు ఓవర్లలో ఏకంగా 88 పరుగులు సమర్పించుకున్నాడు. పంజాబ్ బ్యాటర్ స్టోయినిస్ దెబ్బకు షమి బౌలింగ్ చిన్నాభిన్నమైంది. షమి వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్లో స్టోయినిస్ వరుసగా నాలుగు ఫోర్లను బాదాడు. ఈ సీజన్‌లో ప్రత్యర్థి జట్ల బ్యాటర్లపై ఎలాంటి ప్రభావం చూపలేక పోతున్నాడు. అతని వైఫల్యం జట్టును వెంటాడుతోంది. కనీసం మిగిలిన మ్యాచుల్లోనైనా షమి మెరుగైన ప్రదర్శన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.