Wednesday, April 16, 2025

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు మావోల హతం

- Advertisement -
- Advertisement -

బస్తర్: ఛత్తీస్‌గఢ్ లో ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. బుధవారం ఉదయం ఛత్తీస్‌గఢ్‌లోని కొండగావ్-నారాయణ్‌పూర్ సరిహద్దు వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు నక్సలైట్లు మృతి చెందారు. భద్రతా బలగాలు, స్థానిక పోలీసులు కలిసి సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈక్రమంలో మావోయిస్టులు బలగాలపై కాల్పులకు పాల్పడ్డారు. దీంతో అప్రమత్తమైన బలగాలు ఎదురుకాల్పులు జరిపారు. ఈ క్రమంలో ఇదరు మావోలు ప్రాణాలు కోల్పోయారు. ఘటనాస్థలం నుండి ఒక AK-47 రైఫిల్, నక్సలైట్ల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం సంఘటనాస్థలంలో ఎన్‌కౌంటర్‌ కొనసాగుతుందని ఐజీ బస్తర్ పి సుందర్‌రాజ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News