Sunday, April 20, 2025

బలవంతంగా అశ్లీల వీడియోల చిత్రీకరణ.. నిందితుల అరెస్ట్

- Advertisement -
- Advertisement -

గుంటూరు: పలు అశ్లీల వె‌బ్‌సైట్లకు అశ్లీల వీడియోలను విక్రయిస్తున్న ముఠాను ఈగల్ టీం అధికారులు అరెస్ట్ చేశారు. ముగ్గురు నిందితులను బుధవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ మాట్లాడుతూ.. గుంతకల్లుకు చెందిన లూయిస్.. కాల్ సెంటర్ నడుపుతూ.. అక్కడ పని చేస్తున్న వారితో బలవంతంగా అశ్లీల వీడియోలు చిత్రీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. కొన్ని అశ్లీల వెబ్‌సైట్లకు వీడియోలను అందిస్తూ.. క్రిప్టో కరెన్సీ ద్వారా చెల్లింపులు చేస్తున్నారని తెలిపారు. చిత్రీకరించిన వీడియోలను నిషేధిత వెబ్‌సైట్లకు అమ్ముతున్నాడని.. సైప్రస్ దేశానికి చెందిన సైట్ నిర్వహకులు అన్‌లైన్‌ ద్వారా చెల్లింపులు చేస్తున్నారని.. లూయిస్‌తో పాటు శ్రీకాకుళానికి చెందిన గణేశ్, జ్యోత్స్నలను అరెస్ట్ చేసినట్లు స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News