ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్, కొండగావ్ జిల్లాల సరిహద్దులో బుధవారం ఉదయం పోలీసులకు, నక్సలైట్లకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఇరువైపులా జరిపిన కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులను భద్రతా బలగాలు హతమార్చాయి. మృతి చెందిన మావోయిస్టులలో హల్దార్ డీవీసీఎం (డివిజనల్ కమిటీ సభ్యుడు)పై రూ.8 లక్షలు, రామే ఏసీఎం (ఏరియా కమిటీ సభ్యుడు)పై రూ.5 లక్షల రివార్డు ఉంది. మృతదేహంతోపాటు ఏకే-47 వంటి ఆటోమేటిక్ ఆయుధాలు కూడా భద్రత బలగాలు స్వాధీనం చేసుకున్నారు. 2025లో ఇప్పటి వరకు 148 మంది నక్సలైట్లను సైనికులు హతమార్చారు.
కొండగావ్, నారాయణపూర్ జిల్లాల సరిహద్దులో ఉన్న కిలాం-బర్గం ప్రాంతంలో నక్సలైట్ల భారీ సంఖ్యలో గుమ్మిగుడి ఉన్నట్లు నిఘా వర్గాల పక్కా సమాచారం మేరకు మంగళవారం డిఆర్‌జి (డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్), బస్తర్ ఫైటర్స్ బృందాన్ని సంఘటనా స్థలానికి పంపారు. ఈ క్రమంలో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌ను బస్తర్ ఐజీ సుందర్ రాజ్ పి.ధ్రువీకరించారు. నక్సలైట్లపై ఇది మరో పెద్ద విజయం అని అన్నారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో సోదాలు కొనసాగుతున్నాయని ఆయన అన్నారు.