Sunday, April 20, 2025

డ్రగ్స్ దందాలో ఉత్తర్‌ప్రదేశ్ మాజీ సిఎస్ కుమారుడు?

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : అమెరికాలోని ఫ్లోరిడా, కాలిఫోర్నియాలో పండించే ఓజీ కుష్ అనే డ్రగ్స్‌తో పాటు విదేశీ మ ద్యం బాటిళ్లను తెలంగాణ ఎస్‌టిఎఫ్, ఎక్సైజ్ పోలీసులు సం యుక్తంగా పట్టుకున్నారు. ఇద్దరు డ్రగ్స్ పెడ్లర్లను అదుపులోకి తీసుకున్నట్లు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ జాయింట్ కమిషనర్ ఖురేషి చెప్పారు. వీరిద్దరిలో ప్రితీష్ భట్ అనే వ్యక్తి ఉత్తరప్రదేశ్ మాజీ సిఎస్ తనయుడిగా భావిస్తున్నారు. స్కోడా కారు, గంజాయి, సింథటిక్ డ్రగ్స్, చరస్ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నాంపల్లి ఎక్సైజ్ భవన్‌లో ఏ ర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. స్వా ధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ సుమారు రూ.40 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ‘కాచిగూడ రైల్వేస్టేషన్ వద్ద బైక్‌పై ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. స్కోడా కారులో మరో వ్యక్తి ఓజీ కుష్ డ్రగ్స్‌ను మార్పిడి చేసుకునే సమయంలో ఎస్‌టిఎఫ్ ఎక్సైజ్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. కారులో తనిఖీలు చేయగా 500 గ్రాముల ఓజీ కుష్ డ్రగ్, కెజి గంజాయి, 6 గ్రాముల చరస్, 4.38 గ్రాముల సింథటిక్ డ్రగ్స్‌తో పాటు 5 విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నాం. ఇద్దరు నిందితులు లను అరెస్టు చేశా’మని ఖురేషి వెల్లడించారు. మరో వ్యక్తి జయసూర్యగాగా గుర్తించారు. కాగా, అతడు ప్రీతిష్ భట్ స్నేహితుడిగా భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News