Monday, April 21, 2025

ఎంతో మంది నియంతలకు ప్రజలు గుణపాఠం చెప్పారు: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కంచ గచ్చిబౌలి విషయంలో ఐఎఎస్, అటవీ అధికారుల వంతైందని.. అధికారులు జాగ్రత్తగా ఉండాలని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. మూటల వేట సిఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అరాచకాలతో సిఎస్ తో పాటు అధికారులు బలిపశువులవుతున్నారని కెటిఆర్ ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి సైన్యంలా కొందరు పోలీసులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇష్టాను సారంగా కేసులు పెట్టిన పోలీసులపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రైవేటు ముఠాలా వ్యవహరిస్తున్న పోలీసులు ఊచలు లెక్కించాల్సి వస్తుందని హెచ్చరించారు. హెచ్ సియు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహారాన్ని సుప్రీం కోర్టు ఎండగట్టిందని ధ్వజమెత్తారు. ఈ విషయంలో బిజెపికి చిత్తశుద్ధి ఉందా? లేదా? అనేది నెలాఖరు వరకు ఎదురు చూస్తామన్నారు. నెలాఖరులో బిఆర్ఎస్ భేటీ తర్వాత కేంద్ర ప్రభుత్వ సంస్థల వద్దకు వెళ్తామని కెటిఆర్ సూచించారు.

ఆధారాలతో సహా కేంద్ర ప్రభుత్వ సంస్థలకు వివరాలు అందజేస్తామని, ప్రజల మాటలను కొత్త ప్రభాకర్ రెడ్డి సరిగానే చెప్పారని అన్నారు. తమతో కూడా చాలా మంది అదేమాట అంటున్నారని, బంగ్లాదేశ్ తరహాలో జనమే రోడ్లపైకి వచ్చి ప్రభుత్వాన్ని పడగొడతారని చురకలంటిచారు. ఎంతో మంది నియంతలకు ప్రజలు గుణపాఠం చెప్పారని, మళ్లీ 20 ఏళ్ల వరకు ప్రజలు కాంగ్రెస్ కు ఓటు వేయరని, ప్రజలకు కూడా అన్ని విషయాలు అర్థం కావాలన్నారు. ఆర్థిక దోపిడి, పర్యావరణ విధ్వంసానికి పాల్పడిన సిఎంపై విచారణ చేయాలని, సిట్టింగ్ జడ్జి లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థచే విచారణ చేయాలని కోరారు. రేవంత్ రెడ్డి ఐదేళ్ల వరకు సిఎంగా ఉండాలని కోరుకుంటున్నానని, ప్రభుత్వాన్ని కూలగొట్టాల్సిన ఖర్మ తమకు లేదని కెటిఆర్ స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News