- Advertisement -
అమరావతి: గతంలో వైసిపి అధినేత, మాజీ సిఎం జగన్ మోహన్ రెడ్డి ఎక్కడికి వచ్చినా.. ప్రతిపక్ష నేతలను హౌస్ అరెస్టు చేసేవారని ఎపి హోం మంత్రి వంగలపూడి అనిత విమర్శించారు. జగన్ కాలం నాటి అరాచక పరిస్థితులు ఇప్పుడు ఎక్కడా లేవని అన్నారు. ఈ సందర్భంగా తిరుపతిలో ఆమె మాట్లాడుతూ..కూటమి పాలనలో ఎవరినీ హౌస్ అరెస్ట్ చేయలేదని చెప్పారు. తిరుపతిలో పోలీసులు ఎవరినీ నిర్భందించలేదని తెలియజేశారు. ఇప్పుడు రాష్ట్రంలో గృహ నిర్భంధాల ఊసేలేదని, కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఎవరినీ హౌస్ అరెస్టు చేయలేదని హోం మంత్రి అనిత పేర్కొన్నారు.
- Advertisement -