- Advertisement -
గ్రూప్-1 నియామకాలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గ్రూప్-1 నియామకాలను తాత్కాలికంగా నిలిపివేయాలని న్యాయస్థానం టీజీపీఎస్సీని ఆదేశించింది. విచారణ పూర్తయ్యే వరకు నియామక పత్రాలు ఇవ్వొద్దని పేర్కొంది. అయితే, సర్టిఫికెట్ వెరిఫికేషన్ కొనసాగించవచ్చని టీజీపీఎస్సీకి తెలిపింది.
కాగా, 2024 ఫిబ్రవరిలో 563 గ్రూప్ 1 పోస్టులకు టీజీపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. జూన్ లో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించగా.. అక్టోబర్ లో మెయిన్స్ పరీక్షలు జరిగాయి. మార్చి 10న గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష ఫలితాలు ప్రకటించిన టిజిపిఎస్సి.. మార్చి 30న జనరల్ ర్యాంక్స్ విడుదల చేసింది.
- Advertisement -