- Advertisement -
తిరుపతి: వైసిపి నేత, టిటిడి మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డిపై కేసు నమోదైంది. టిటిడి గోశాలలో గోవుల మరణాలపై
భూమన అసత్య ప్రచారం చేశారని ఫిర్యాదు చేశారు. భానుప్రకాష్‌రెడ్డి ఫిర్యాదుతో భూమనపై పోలీసులు కేసు నమోదు చేశారు. బిఎన్‌ఎస్ 353 క్లాజ్ 1, 299, 74 ఐటి యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. టిటిడి గోశాలలో గోవుల మృతిపై భూమన కరుణాకర్ రెడ్డి సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో పాటు టిటిడిపై పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
- Advertisement -