- Advertisement -
న్యూఢిల్లీ: కేదార్‌నాథ్ ధామ్ తలుపులు మే 2న అధికారికంగా భక్తుల కోసం తిరిగి తెరవబడతాయని.. అలాగే, బద్రీనాథ్ ధామ్ ద్వారాలు మే 4న తెరుచుకుంటాయని శ్రీ బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ (BKTC) ప్రతినిధి తెలిపారు. ఇక, రెండవ కేదార్ గా పిలువబడే మద్మహేశ్వర్ ఆలయం గర్భగుడి మే 21న, మూడవ కేదార్ గా పిలువబడే తుంగ్నాథ్ ఆలయం ద్వారాలు మే 2న తిరిగి తెరవనున్నట్లు తెలిపారు.
చార్ ధామ్ యాత్ర భారతదేశంలోని అత్యంత పవిత్రమైన తీర్థయాత్రలలో ఒకటి. ఇది నాలుగు పవిత్ర పుణ్యక్షేత్రాలైన యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్ వరకు కొనసాగుతుంది. ఈ యాత్ర యమునోత్రితో ప్రారంభమై.. గంగోత్రి, కేదార్‌నాథ్ మీదుగా బద్రీనాథ్‌లో ముగుస్తుంది. యమునోత్రి ధామ్ ఏప్రిల్ 30న గంగోత్రి ధామ్‌తో పాటు తెరుచుకోనుంది.
- Advertisement -