Sunday, April 20, 2025

ఉద్యోగాల కోసం హైదరాబాద్‌ వచ్చిన యువతులతో వ్యభిచారం..

- Advertisement -
- Advertisement -

సికింద్రాబాద్‌ పరిధిలో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టు రట్టు అయ్యింది. రాంగోపాల్‌పేటలోని బాపుబాగ్‌ కాలనీలో ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. ఉద్యోగాల కోసం హైదరాబాద్‌ వచ్చిన అమాయక యువతులకు మాయమాటలు చెప్పి వ్యభిచారంలోకి దింపుతున్నారు. ఈక్రమంలో సమాచారం అందుకున్న పోలీసులు.. యువతులను స్వప్న అనే మహిళ వ్యభిచారంలోకి లాగుతున్నట్లు గుర్తించారు. దీంతో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇంటిపై పోలీసులు దాడులు చేశారు. ముఠా నుంచి ఇద్దరు యువతులను రక్షించారు. ముఠాలోని మహమ్మద్‌ అవియాస్‌, హుస్సేన్‌లను పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న లడ్డు, స్వప్న కోసం పోలీసులు గాలిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News