- Advertisement -
జనగామ: జిల్లాలోని రఘునాథపల్లి మండల పరిథిలో లారీ బీభత్సం సృష్టించింది. హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై కోమల్ల టోల్‌గేట్ వద్ద అదుపు తప్పిన లారీ ఒక్కసారిగా టోల్‌గేట్ క్యాబిన్‌వైపు దూసుకువచ్చింది. ఈ ప్రమాదంలో క్యాబిన్ పూర్తిగా ధ్వంసం కాగా.. ఉద్యోగి గాయపడ్డాడు. ప్రమాదంలో మరో కారు ధ్వంసమైంది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనస్థలానికి చేరుకున్నారు. లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉండటమే ప్రమాదానికి కారణంగా గుర్తించారు. టోల్‌గేట్ నిర్వహకుల ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఇతర వాహనాలకు ఇబ్బంది కలగకుండా రాకపోకలను పునరుద్దరించారు.
- Advertisement -