హైడ్రా చొరవతో.. వెలుగులోకి
78 ఎకరాల ప్రభుత్వ భూమి
క్రికెట్ ఆడుకోనివ్వడం లేదని, చెరువును కబ్జా చేసి రహదారులు
నిర్మిస్తున్నారని హైడ్రాకు యువకుల ఫిర్యాదు రంగంలోకి దిగిన
అధికారులు షేక్‌పేట మండలం రాయదుర్గం దర్గా సమీపంలోని
5/2 సర్వే నెంబర్‌లో పరిశీలన 39 ఎకరాల ప్రభుత్వ భూమి
కబ్జాకు గురైనట్లు గుర్తింపు
హఫీజ్‌పేట్ సర్వే నెం. 79లో 39.2
ఎకరాలు రాయదుర్గం దర్గా
సర్వే నెం. 5/2లో 39 ఎకరాలు
కోర్టు కేసులున్నా.. నిర్మాణాలు,
అమ్మకాలు ల్యాండ్ గ్రాబింగ్ కేసుల
బోర్డుల పక్కనే అమ్మకాలంటూ
బోర్డులు ప్రభుత్వ భూములంటూ
బోర్డులు ఏర్పాటు చేసిన హైడ్రా
మనతెలంగాణ, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రజల ఫిర్యాదులు.. హైడ్రా చర్యలతో వేల కోట్ల ప్రభుత్వ భూములు ఆక్రమణల నుంచి రక్షించబడుతున్నాయి. దానికి నిదర్శనంగా శేరిలింగంపల్లి మండలం హఫీజ్‌పేట్ సర్వే నెం. 79లోని 39.2 ఎకరాల భూమి, షేక్‌పేట్ మండలం రాయదుర్గం దర్గా సమీపంలోని సర్వే నెం. 5/2లో 39 ఎకరాల భూమి. శనివారం.. హైడ్రా తీసుకున్న చర్యలతో తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చింది. హఫీజ్‌పేట్ సర్వే నెంబర్ నెం. 79 ప్రభుత్వ భూమి, నిషేధిత జాబితాలో ఉన్నట్టు రెవెన్యూ రికారులు వెల్లడిస్తున్నాయి. ఆ సర్వే నెం. 79/1గా సృష్టించి ప్రభుత్వ వ్యవస్థలను తప్పదోపట్టించిన వసంత హోమ్స్ సంస్థ అక్రమ నిర్మాణాలు చేపట్టినట్టు హైడ్రాకు ఫిర్యాదులు అందా యి. ఇప్పటికే 19 ఎకరాలను కాజేసి ఇళ్లు నిర్మించి అమ్మేసినట్టు కూడా హైడ్రా గుర్తించినట్టు అధికారులు వెల్లడిస్తున్నారు. ఖాళీగా ఉన్న 20 ఎకరాల ప్రభుత్వ భూ మిలో ఆఫీసు కార్యాలయంతో పాటు.. పలు షెడ్డులు ఏ ర్పాటుచేసి వివిధ సంస్థలకు వసంత హౌస్ నిర్మాణ సంస్థ అద్దెకు ఇచ్చినట్టు హైడ్రా గుర్తించింది. ఈ భూమిపై సుప్రీం కోర్టులో చాలా కాలంగా సి.ఎస్.14/58 అనే వాజ్యం పెండింగులో ఉండగా కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ అక్రమంగా నిర్మాణాలు చేపట్ట్టి వివిధ సంస్థలకు అద్దెకు ఇవ్వడం జరిగిందని హైడ్రా వెల్లడించింది.
కోర్టు కేసులు ఉండగానే..
హఫీజ్‌పేట్‌లోని 39.2 ఎకరాల ప్రభుత్వ భూమిపై కోర్టు లో కేసులుండగా, ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదనే నిబంధనలున్నా పట్టించుకాకుండా ఆ సంస్థ నిర్మాణాలు చేపట్టడం గమనార్హమని హైడ్రా అధికారులు పేర్కొంటున్నారు. ఫైనల్ డిక్రీ రాకుండానే ఈ భూముల్లో నిర్మాణాలు ఎలా చేపడుతున్నారని వ్యాజ్యాన్ని కోర్టు విచారిస్తున్న సందర్భంగా సుప్రీం కోర్టు విస్మయం వ్యక్తంచేసినట్టు హైడ్రా అధికారులు పేర్కొన్నారు. ప్రహరీతో పాటు లోపల చేపట్టిన నిర్మాణాలను తొలగించి ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ హైడ్రా బోర్డులు ఏర్పాటు చేసినట్టు వారు వెల్లడించారు. ఇంతగా అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నా.. నిషేధిత ప్రాంతంలో కట్టడాలు వెలుస్తున్నా ప్రభుత్వ విభాగాలు మౌనం వహించడంపై హైడ్రా అధికారులు ఆశ్చర్యానికి లోనయ్యారు.
ఆడుకోనివ్వడం లేదని..
తాము రోజూ ఆడుకునే చోట క్రికెట్ ఆడనివ్వడంలేద నీ.. అక్కడ చెరువును మాయం చేస్తున్నారనీ.. ర హదారులను నిర్మిస్తున్నారని గుర్తించిన అదే ప్రదేశంలో క్రికె ట్ ఆడుకునే యువకుల ఫిర్యాదుతో హైడ్రా అధికారు లు రంగంలోకి దిగారు. షేక్‌పేట్ మండలం రాయదు ర్గం దర్గా దగ్గరలోని సర్వే నెంబర్ 5/2లో క్షేత్రస్థాయి లో హైడ్రా అధికారుల బృందం పరిశీలించి, విచారణ చేయగా 39 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఆక్రమణలు జరుగుతున్నట్టు హైడ్రా అధికారులు నిర్ధారణకు వచ్చినట్టు తెలిపారు. ల్యాండ్ గ్రాబింగ్ కేసులున్నట్టు అక్కడ బోర్డులుంటుండగానే.. మరోవైపు అక్కడ ప్లాట్ల కొనుగోలుకు సంప్రదించాల్సిన ఫోను నంబర్లతో బోర్డులను నార్నే ఎస్టేట్ బోర్డులను ఏర్పాటు చేసిందని హైడ్రా అ ధికారులు పేర్కొంటున్నారు. అనుమతిలేని లే ఔట్‌తో రహదారులు నిర్మిస్తూ.. ప్లాట్లు అమ్మకాలు చేపడుతున్నారనేది హైడ్రా అధికారులు భావిస్తున్నారు. అక్కడ చెరువును కబ్జాచేసి ప్లాట్లుగా చేసి భూమి అమ్మకాలను నార్నే ఎస్టేట్స్ సంప్థ నిర్వహిస్తున్నట్టు హైడ్రా విచారణలో తేలిందని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. హఫీజ్‌పేట్, రాయుదుర్గం ప్రాంతాల్లోని ప్రభు త్వ భూముల్లోని ఆక్రమణలు తొలగించి ప్రభుత్వ భూ ములుగా పేర్కొంటూ బోర్డులను హైడ్రా ఏర్పాటు చేసింది.