- Advertisement -
ఐపిఎల్‌లో భాగంగా శనివారం చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన పోరులో లక్నో సూపర్ జెయింట్స్ రెండు పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ఓపెనర్ మార్‌క్రమ్ (66), అయుష్ బడోని (50) అర్ధ సెంచరీలతో రాణించారు. ఇక విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన సమద్ 10 బంతుల్లోనే 4 సిక్స్‌లతో అజేయంగా 30 పరుగులు చేశాడు. తర్వాత బ్యాటింగ్‌కు రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లకు 178 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. అరంగేట్రం మ్యాచ్ ఆడిన చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ (34), యువ ఓపెనర్ యశస్వి (74) రాణించినా ఫలితం లేకుండా పోయింది.
- Advertisement -