Sunday, April 20, 2025

కాంగ్రెస్, బిఆర్‌ఎస్ నక్సలైట్ల వారసులు

- Advertisement -
- Advertisement -

15 నిమిషాలు టైమిస్తే హిందువులను చంపేస్తామన్న మజ్లిస్‌ను గెలిపించేందుకు కుట్ర చేస్తారా? ప్రజాస్వామ్యంలో ఉంటూ
ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉంటారా? మీ వైఖరితో హిందూ సమాజమంతా రగలిపోతోంది : కేంద్రమంత్రి బండి సంజయ్

మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్, బీఆర్‌ఎ స్ పార్టీలు నక్సలైట్ల వారసులు అంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో అడుగు ముందుకే సి 15 నిమిషాలు టైమిస్తే హిందువులను చంపేస్తామన్న మజ్లిస్‌ను గెలిపించేందుకు కుట్ర చేస్తా రా? అం టూ రెచ్చిపోయారు. ప్రజాస్వామ్యంలో ఉంటూ ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉంటా రా? అని బి ఆర్‌ఎస్ పార్టీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ వైఖరితో హిందూ సమాజమంతా రగలిపోతోందని మండిపడ్డారు. హై దరాబాద్‌లోని బర్కత్‌పురా బిజె పి నగర కార్యాలయంలో బీజే పీ నాయకులతో కలి సి బండి సంజయ్ శనివారం భేటీ అ య్యారు. ఈ సందర్భంగా జీ హెచ్‌ఎంసీ స్థానిక ఎమ్మెల్సీ ఎ న్నికలపై ఆయన దిశానిర్దేశం చేశారు.

ఈ సం దర్భంగా ఆ యన మీడియాతో మాట్లాడు తూ రాముడి వారసులెవరో, రజకార్ వారసులెవరో ప్రజలకు తెలుసునని కీల క వ్యాఖ్యలు చేశారు. కార్పొరేటర్లరా విప్‌కు భ యపడి ఓటింగ్‌కు దూరమైనా, మజ్లిస్‌కు ఓటేసి నా మీ రాజకీయ భవిష్యత్తు ఖతమేనని అ న్నా రు. జీహెచ్‌ఎంసీ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ దూరంగా ఉండాలని బీఆర్‌ఎస్ తీసుకున్న నిర్ణయంపైనా, ఎన్నికల్లో పోటీ చేయని కాంగ్రెస్ పైనా కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు.

ఎన్నికలకు దూరంగా ఉండేది నక్సలైట్లె

ప్రజాస్వామ్యంలో ఎన్నికలకు దూరంగా ఉండే ది, ఓటింగ్ ను బహిష్కరించేది నక్సలైట్లు మాత్రమేనని అన్నారు. ఆ నక్సలైట్ల వారసులే కాంగ్రెస్, బీఆర్‌ఎ స్ నేతలని మండిపడ్డారు. అలాంటి పార్టీలను రాబోయే ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల విప్‌లకు భయపడి ఓటింగ్‌కు దూరంగా ఉన్నా, మ జ్లిస్ పార్టీని గెలిపించినా ఆయా పార్టీల కార్పొరేటర్ల రాజకీయ భవిష్యత్తు ఖతం కాబోతోందని హె చ్చరించారు. తెలంగాణలోని 85 శాతం హిం దువులంతా తీవ్రమైన ఆగ్రహంతో ఉన్న విషయా న్ని గుర్తు చేశారు. విప్ లకు భయపడి నిర్ణయం తీసుకుంటారో, ఓ టింగ్ కు హాజరై మజ్లిస్ ను ఓ డిస్తారో తేల్చుకోవాలని కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కా ర్పొరేటర్లకు సూచించారు.

హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఆ రెం డు పార్టీలు పోటీ చేయకుండా మజ్లిస్ ను గెలపించాలని చూస్తున్నాయ న్న ఆయన 15 నిమిషాలు టై మిస్తే హిందువుల ను నరికి చంపుతామన్న మజ్లిస్ తో కలిసి ఆ రెం డు పార్టీలు అంటకాగుతున్నాయని ఆరోపించా రు. హిందువుల మనోభావాలను వివరించి బీజే పీ అభ్యర్ధి గౌతమ్ రావును గెలిపించాలని కో రారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షలు చింతల రామచంద్రారెడ్డి, డాక్టర్ మనోహర్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, గౌతమ్ రావు, రాంచంద్రరావు, లంకల దీపక్ రెడ్డి, ప్రకాశ్ రెడ్డి, గుండగోని భరత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News