ఐపిఎల్ 2025లో భాగంగా ఆదివారం రెండు కీలక మ్యాచ్‌లు జరగనున్నాయి. దీంతో ఇవాళ కూడా క్రికెట్ లవర్స్ కు డబుల్ ధామాకా లభించనుంది. ఈ రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు న్యూ చండీగఢ్ వేదికగా పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. వరుస విజయాలతో జోరుమీదున్న పంజాబ్ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు, ఆర్సీబి సొంత గడ్డపై ఓటములతో సతమతమవుతున్న ఆర్సీబి ఈ మ్యాచ్ లో గెలిచి సత్తా చాటాలని భావిస్తోంది.
ఇక, రాత్రి 7.30 గంటలకు వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ఢీకొనబోతున్నాయి. ఇక పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న చెన్నైకి ఈ మ్యాచ్ ఎంతో కీలకం కానుంది. ఇందులో ఓడిపోతే చెన్నైకి ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టమవుతాయి. పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉన్న ముంబై.. చెన్నైపై విజయం సాధించిన తమ స్థానాన్ని మరింత మెరుగుపర్చుకోవాలని పట్టుదలగా ఉంది.