హైదరాబాద్: ప్రస్తుతం యువతను వేధిస్తున్న ప్రధాన సమస్యలలో ఒకటి మాదకద్రవ్యాలు. చాలా మంది యువత వీటికి బానిలై.. తమ అమూల్యమైన జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు. డ్రగ్స్‌ని అరికట్టేందుకు ప్రభుత్వాలు ఎంత కృషి చేసినా.. వాటి చలామణిని మాత్రం ఆపలేకపోతున్నాయి. వీటి నుంచి దూరంగా ఉండాలని చాలా మంది సెలబ్రిటీలు ఇప్పటికే అవగాహన కల్పించారు. తాజాగా మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతీ ఒక్కరు పోరాటం చేయాలని మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు.
హైదరాబాద్‌లోని టివర్క్స్ వద్ద నోటి క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి వర్చవల్‌గా తన సందేశాన్ని పంపించారు. డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం ప్రతీ ఒక్కరు చేయి చేయి కలపాలని ఆయన కోరారు. వ్యసనాలకు బానిసలై కొందరు యువత తమ జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. మాదకద్రవ్యాల కట్టడికి ప్రభుత్వంతో పాటు అందరం అవగాహన కల్పించాలని కోరారు.