- Advertisement -
చింతలపాలెం: సూర్యాపేట జిల్లా చింతలపాలెం వద్ద ఆదివారం మధ్యాహ్నం ఆర్‌టిసి బస్సు బోల్తాపడింది. బైక్‌ను తప్పించే క్రమంలో ఆర్‌టిసి బస్సు స్టీరింగ్ రాడ్డు విరిగింది. దీంతో బస్సు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. 25 మంది ప్రయాణికులతో ఆర్‌టిసి బస్సు కోదాడ నుంచి చింతలపాలెం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
- Advertisement -