- Advertisement -
ఛండీగఢ్: ఐపిఎల్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సిబి విజయం సాధించింది. బెంగళూరు ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. ఆర్‌సిబి 18.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 158 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు ముందు ఉంచింది. ఆర్‌సిబి బ్యాట్స్‌మెన్లలో విరాట్ కోహ్లీ దేవ్‌దూత్ పడిక్కల్ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. పంజాబ్ బౌలర్లు, బ్యాట్స్‌మెన్లు విఫలం కావడంతో ఓటమిని చవిచూశారు.
- Advertisement -