పంజాబ్‌పై బెంగళూరు ఘన విజయం
అర్ధ శతకాలతో రాణించిన కోహ్లీ, పడిక్కల్
మొహాలీ: సొంత గడ్డపై జరిగిన పరాభావాని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రతీకారం తీర్చుకుంది. ఆదివారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వారి సొంతమైదానంలో ఓడించి రివేంజ్ తీర్చుకుంది. ఈ హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ నిర్దేశించిన 158 పరుగుల లక్షాన్ని బెంగళూరు సునాయాసంగా ఛేదించింది. మరో 7 బంతులు ఉండగానే లక్ష్యాన్ని అందుకుంది. విరాట్ కోహ్లీ, దేవ్‌దత్ పడిక్కల్ బ్యాట్ ఝలిపించడంతో కేవలం 3 వికెట్లు కోల్పోయి ఐపిఎల్1లో ఐదో విజయాన్ని నమోదు చేసింది. 158 పరుగుల లక్ష ఛేదనకు దిగిన బెంగళూరు బ్యాటర్లు.. ఓపెనర్ విరాట్ కోహ్లీ (73 54 నాటౌట్ (54 బంతులు: 7×4, 1×6), దేవదత్ పడిక్కల్ 61(35 బంతులు: 5×4, 4×6) అర్ధ శతకాలతో చెలరేగడంతో బెంగళూరుకు విజయం నల్లేరుపై నడకగా మారింది. విరాట్ చివరివరకూ క్రీజులో ఉండి బెంగళూరుకు విజయాన్ని అందించారు. 18.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది.
పంజాబ్‌కు శుభారంభం..
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన పంజాబ్‌కు ఓపెనర్లు జట్టుకు శుభారంభాన్ని అందించారు. 4.2 ఓవర్లలో 42 వద్ద ప్రియాంష్ ఆర్య(15)ను స్పిన్నర్ కృనాల్ పాండ్యా ఔట్ చేసి. మరో ఓపెనర్ ప్రభ్ సిమ్రన్ సింగ్ (33)ను సైతం పాండ్యానే పెవిలియన్ పంపాడు. ఆతరువాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ను కుదురుకోనివ్వలేదు. 10 బంతులాడిన అయ్యర్ 6 పరుగులు చేసి రొమారియో షెఫర్డ్ బౌలింగ్‌లో కృనాల్ పాండ్యా పట్టిన క్యాచ్‌కు ఔటయ్యాడు. అంతకుముందు మ్యాచ్‌లో బెంగళూరుపై చెలరేగిన నేహల్ వధేరా (5) రనౌట్ కావడంతో పంజాబ్ కు ఊహించని దెబ్బ తగిలింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన జోష్ ఇంగ్లీష్ (29)ను, అదే ఓవర్లో 5వ బంతికి మార్కస్ స్టోయినిస్ (1)ను సైతం క్లీన్ బౌల్డ్ చేశాడు బౌలర్ సుయాష్ శర్మ. ఆతరువాత మరో వికెట్ పడకుండా శశాంక్ సింగ్ (31), మార్కో జాన్సన్ (25)లు స్కోరు బోర్డును ముందుకు నడిపారు. బంగళూరు బౌలర్లను ఎదుర్కొంటూ క్రీజులో కొనసాగారు. దీంతో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది.
కోహ్లీ అరుదైన ఫీట్..
జాన్‌సెన వేసిన ఓవర్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. ఐపిఎల్ చరిత్రలో అత్యధిక హాఫ్ సెంచరీలు బాదిన క్రికెటర్‌గా నిలిచాడు. ఇప్పటి వరకు డేవిడ్ వార్నర్ (66)తో సమంగా ఉన్న విరాట్.. తాజా మ్యాచులో పంజాబ్ పై అర్ధ శతకం బాది, వార్నర్‌ను అధిగమించాడు. తన ఖాతాలో 67 హాఫ్ సెంచరీలను వేసుకున్నాడు. ఈ జాబితాలో శిఖర్ ధావన్ (53), రోహిత్ శర్మ (45), కేఎల్ రాహుల్ (43) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇక ఓవరాల్‌గా టి20 క్రికెట్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు బాదిన క్రికెటర్‌గా మూడో స్థానంలో ఉండగా.. డేవిడ్ వార్నర్ 116తో టాప్ స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత క్రిస్ గేల్ (110)తో సమంగా నిలిచాడు కోహ్లీ. ఆ తర్వాతి స్థానాల్లో బాబర్ అజామ్ (101), జోస్ బట్లర్ (94) ఉన్నారు.