Monday, April 21, 2025

రేవంత్ రెడ్డి, మందుల సామేల్ చిత్రపటాలకు పాలాభిషేకం

- Advertisement -
- Advertisement -

మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని వడ్డెర కాలనీలో కాలనీ వాసులు సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మందుల సామేల్ ల చిత్ర పటాలకు పాలాభిషేకం చేశారు. పేదలకు సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్థానిక శాసనసభ్యులు మందుల సామెల్ చిత్ర పాటాలకు కాలనీవాసులు పాలాభిషేకం నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో ప్రారంభమైన సన్న బియ్యం పంపిణీ పథకం ద్వారా పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు .ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ డాక్టర్ జి. లక్ష్మీనరసింహ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గుండగోని రామచంద్రు గౌడ్, సింగిల్ విండో చైర్మన్ పేలంపూడి వెంకటేశ్వర్లు ,నాయకులు, కాలనీ వాసులు మందుల సురేష్, పల్లపు సమ్మయ్య, గుండు శ్రీను, కూరెళ్ళ శ్రీరాములు, బందెల రవి, గొలుసుల సోమయ్య, గొలుసుల దుర్గయ్య, అలకుంట్ల రాజు, అలకుంట్ల సమ్మయ్య, పరుశురాముడు, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News