Monday, April 21, 2025

రజతోత్సవ సభ విజయవంతం చేయాలి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/మోత్కూర్: ఈనెల 27 న వరంగల్ లో జరిగే బీ ఆర్ ఎస్ రజతోత్సవ సభ ను విజయవంతం చేయాలని బీ ఆర్ ఎస్ మండల,పట్టణ అధ్యక్షులు పొన్నెబోయిన రమేష్, జంగ శ్రీను లు అన్నారు. ఆదివారం మోత్కూర్ మండలంలోని అనాజిపురం గ్రామంలో, మున్సిపాలిటీలోని 11, 12వ వార్డులలో ఈనెల 27న వరంగల్ జరిగే బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ సమావేశాలు నిర్వహించారు. సమావేశాలు మండల, పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 27న వరంగల్‌లో జరగనున్న బహిరంగ సభకు మండలంలోని అన్ని గ్రామాలు, మున్సిపాలిటీ లోని అన్ని వార్డుల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త ఈ సభ విజయానికి బాధ్యత తీసుకోవాలని, నాయకత్వం నిరూపించుకోవాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కొణతం యాకుబ్ రెడ్డి, సర్పంచుల సంఘం రాష్ట్ర కార్యదర్శి రాంపాక నాగయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు వళ్లందాసు వెంకటయ్య , నాయకులు కొల్లు శంకర్, నిమ్మల సత్యనారాయణ, సంతోష్ రెడ్డి, నరసయ్య, ఉప్పల యాదయ్య, చుక్క కృష్ణ, వెంకన్న, డాక్టర్ చంద్రమౌళి, పైళ్ళ రమేష్, చుక్క వాసు, కూరెళ్ళ పరమేష్, నకిరేఖ కంటి శ్రీను, మొరిగాల వెంకన్న, మోరిగాల శ్రీను, కనుకు రాజు, కూరెళ్ళ గంగులు, మెంట ఎల్లయ్య, 12వ వార్డు అధ్యక్షులు కూరెళ్ళ సైదులు, కూరెళ్ళ ఇంద్రశేఖర్, చుక్క అశోక్, కొమ్ము సైదులు, కూరెళ్ళ రమేష్, బందెల శ్రీను, రుద్రపెల్లి గణేష్, కూరెళ్ళ శ్రీశైలం, చెడిపెళ్లి ఆనంద్, కూరెళ్ళ నర్సింహా, కూరెళ్ళ దాసు, పల్లె నవీన్, చుక్క కిషన్, కడియం స్వామి, కూరెళ్ళ సతీష్, కూరెళ్ళ వెంకన్న, రుద్రపెల్లి నర్సింహా, మహేష్, ప్రణయ్ తదితరులు హాజరయ్యా రు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News