సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం
మన తెలంగాణ/మోత్కూర్: జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా మే 20 న జరిగే సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం పిలుపునిచ్చారు. ఆదివారం జరిగిన మోత్కూర్ మండల పట్టణ ముఖ్య నాయకుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత కార్మికుల శ్రమ కాలాన్ని పెంచుతూ 8 గంటల నుంచి 12 గంటల వరకు పెంచుతూ లేబర్ కోడ్ ను, తీసుకొచ్చారని సుమారు 29కి పైగా ఉన్న కార్మికుల చట్టాలను రద్దుచేసి, నరేంద్ర మోడీ ప్రభుత్వంనాలుగు లేబర్ కోడ్ లను తీసుకొచ్చిందని అన్నారు.
ఈ లేబర్ కోడ్ లు, కార్మికులకు కంటే, యాజమాన్యాలకు ఉపయోగపడేలా తీసుకువచ్చారని, అందుకే దీనిని వ్యతిరేకిస్తున్నామన్నారు. ఇందుకు దేశ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సంఘాలు సంఘీభావం తెలియజేస్తున్నారని, కార్మికులు ఆలోచించి,ఈ సమస్యలపై మే నెల 20న జరిగే దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. అనంతరం. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయాల పాలైన సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు కూరెళ్ళ నరసింహను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు, గొరిగే సోములు , మోత్కూర్ మండల కన్వీనర్ సామ శ్రీనివాస్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఎస్కే శ్రీను , దిన కూలి మాజీ అధ్యక్షురాలు కొంగరి మల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.