- Advertisement -
ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి..సేకరించిన వడ్ల ను సాధ్యమైనంత త్వరిత గతిన మిల్లులకు రవాణా చేయాలని పౌర సరఫరాల శాఖ ఎన్ ఫోర్స్ మెంట్ డిప్యూటీ తహశీల్దార్ మాచన రఘునందన్ స్పష్టం చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఎట్టి పరిస్థితుల్లోనూ.. లారీలు, బండ్లు లేవు అన్న ప్రశ్న తలెత్తకుండా ట్రాన్స్ పోర్టు గుత్తేదారు బాధ్యత వహించాల్సి ఉందని రఘునందన్ సూచించారు. వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి వల్ల, తూకం ఐన ధాన్యం ను ఎప్పటికప్పుడు ఆలస్యం చేయకుండా సత్వరమే మిల్లులకు తరలించాలని రఘునందన్ లారీ ఓనర్లకు స్పష్టం చేశారు
- Advertisement -