Monday, April 21, 2025

ఆ రెండు సెక్యూలర్‌ పార్టీలు ఎలా అవుతాయి: కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బిఆర్ఎస్‌ పోటీచేయకుండా మజ్లిస్‌కు అండగా ఉంటున్నాయని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఎన్నికైన కార్పొరేటర్లను ఓటువేయకుండా బిఆర్ఎస్‌ బెదిరిస్తోందని దుయ్యబట్టారు. నాంపల్లిలోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇది ఓటేసి గెలిపించిన ప్రజలను అవమానించడమేనని చురకలంటించారు. ఎంఐఎం కోసం ప్రజలు బిఆర్ఎస్, కాంగ్రెస్‌కు ఓటేయలేదని ధ్వజమెత్తారు. మతోన్మాద మజ్లిస్‌కు మద్దతు ఇస్తున్న ఈ రెండు పార్టీలు సెక్యూలర్‌ పార్టీలు ఎలా అవుతాయని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్ ఎంఎల్ సి ఎన్నికల్లో బిజెపి ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మజ్లిస్ తో కాంగ్రెస్ కుమ్మకైందని, బిఆర్ఎస్, మజ్లిస్, కాంగ్రెస్ పార్టీల నిజ స్వరూపం బయటపెట్టాలనే బిజెపి పోటీ చేస్తుందని కిషన్ రెడ్డి వివరించారు. బిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లపై మాజీ సిఎం కెసిఆర్ కు నమ్మకం లేకపోవడంతోనే ఓటింగ్ కు వెళ్లొద్దని చెబుతున్నారని మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News