Monday, April 21, 2025

కూకట్‌పల్లిలో భర్తకు కరెంట్ షాక్ ఇచ్చి… శవాన్ని పూడ్చి పెట్టిన భార్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మేడ్చల్ మల్కాజ్‌గిరిలో జిల్లాలో కూకట్‌పల్లి ప్రాంతం కెపిహెచ్‌బిలో భర్తను భార్య చంపి అనంతరం పూడ్చిపెట్టింది. భర్తపై విరక్తితో అతడిని చంపి అనంతరం పూడ్చిపెట్టింది. కెపిహెచ్‌బిలో సాయిలు, కవిత అనే దంపతులు నివసిస్తున్నారు. భార్య, భర్తకు ఇద్దరికీ వేర్వేరుగా వివాహేతర సంబంధాలు ఉండడంతో ఇద్దరు మధ్య గొడవలు జరిగాయి. ఈ క్రమంలో కొన్ని సంవత్సరాల నుంచి దంపతులు వేర్వేరుగా ఉంటున్నారు. ఈ మధ్యనే దంపతులు కలిసి ఉంటున్నారు. భర్త వేధింపులు భరించలేకే చెల్లెలి భర్త సహాయంతో సాయిలును హత్య చేయడానికి ప్లాన్ వేసింది. భర్త సాయిలును భార్య కవిత కరెంట్ షాక్‌తో చంపి అనంతరం పూడ్చిపెట్టి పారిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News