ఐదుసార్లు ట్రోఫీ గెలిచిన ముంబై ఇండియన్స్ జట్టు ఈ ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్‌ని మాత్రం అత్యంత చెత్తగా ప్రారంభించింది. అందరూ ఈ టీమ్ ప్లేఆఫ్స్‌కి రావడం కష్టమని భావించారు. కానీ, ఆ ఊహల్ని తారుమారు చేస్తూ.. ఎంఐ జట్టు మంచి కమ్‌బ్యాక్ ఇచ్చింది. వరుసగా మూడు మ్యాచ్‌లలో విజయం సాధించి.. తమ ప్లేఆఫ్స్ ఆశలను ఇంకా సజీవంగా చేసుకుంది ముంబై. ఇది చూసిన ముంబై అభిమానులు కోరిన ఇంకో కోరిక కూడా నెరవేరింది. అదేంటంటే.. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఫామ్‌లోకి రావడం. నిన్న చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో ఫ్యాన్స్‌కి ఆకాంక్షించినట్లు రోహిత్ వీరవిహారం చేశాడు. వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ విజృంభించి ఆడాడు.
45 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సులతో 76 పరుగులు చేసి జట్టును విజయం వైపునకు నడిపించాడ. ఈ క్రమంలో పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అత్యధికసార్లు ప్లేయర ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. రోహిత్ 20 సార్లు ఈ అవార్డును అందుకోగా.. ఆ తర్వాతి స్థానంలో 19 అవార్డులతో విరాట్ కోహ్లీ ఉన్నాడు. 25 సార్లు ఈ అవార్డును సొంతం చేసుకొని ఎబి డివిలియస్స మొదటిస్థానంలో ఉన్నాడు.
ఇక అత్యధిక పరగుల లిస్ట్‌లో రోహిత్ రెండో స్థానానికి చేరాడు. 264 మ్యాచుల్లో రోహిత్ 2 సెంచరీలు, 44 అర్థ శతకాలతో 6,786 పరుగులు చేశారు. ఈ లిస్ట్‌లో విరాట్ మొదటి స్థానంలో ఉన్నాడు. 260 మ్యాచుల్లో కోహ్లీ 8 సెంచరీలు, 86 హఫ్ సెంచరీలు ఉన్నాయి. నిన్నటి రోహిత్ స్కోర్‌తో అత్యధిక పరుగుల లిస్ట్‌లో శిఖర్ ధవన్(6,769) మూడో స్థానానికి పడిపోయాడు.